మొక్కీఁ జేకొను మోహపు నీ సతి
(॥పల్లవి॥)
మొక్కీఁ జేకొను మోహపు నీ సతి
చెక్కుదియ్యి దియ్య (దియ్యఁదియ్య) చెదరదు వలపు
(॥మొక్కీ॥)
చనపు నేసుకొని సతి నినుఁ గొసరెను
మనసునఁబెట్టకు మాఁట లింక
ననుపు గలుగఁగా నవ్వులు నవ్వెను
విను నీపట్టుకు వెంగము కాదు
(॥మొక్కీ॥)
చుట్టరికంబున సుదతి చెనకె నిను
పట్టకు యెగ్గులు పలుమారు
జట్టిగొనెఁగనక జంకించె నిపుడు
అట్టిట్టనకుము అరగొర లేదు
(॥మొక్కీ॥)
దేవులతనమున తెఱవ నిన్నొరసె
శ్రీవేంకటేశుఁడ చింతించకు
వానిగలుగఁగా వడి నినుఁ గలసెను
భావించ కిచటఁ గపటమే లేదు
(||pallavi||)
mŏkkīm̐ jegŏnu mohabu nī sadi
sĕkkudiyyi diyya (diyyam̐diyya) sĕdaradu valabu
(||mŏkkī||)
sanabu nesugŏni sadi ninum̐ gŏsarĕnu
manasunam̐bĕṭṭagu mām̐ṭa liṁka
nanubu galugam̐gā navvulu navvĕnu
vinu nībaṭṭugu vĕṁgamu kādu
(||mŏkkī||)
suṭṭarigaṁbuna sudadi sĕnagĕ ninu
paṭṭagu yĕggulu palumāru
jaṭṭigŏnĕm̐ganaga jaṁkiṁchĕ nibuḍu
aṭṭiṭṭanagumu aragŏra ledu
(||mŏkkī||)
devuladanamuna tĕṟava ninnŏrasĕ
śhrīveṁkaḍeśhum̐ḍa siṁtiṁchagu
vānigalugam̐gā vaḍi ninum̐ galasĕnu
bhāviṁcha kisaḍam̐ gabaḍame ledu