Mogasaadu seyagure mudidalaala padigi

మొగచాటు సేయకురే ముదితలాల పతికి
Language

(॥పల్లవి॥)
మొగచాటు సేయకురే ముదితలాల పతికి
తగవెంచి చూచుకొని తానే వచ్చీఁగాని

(॥మొగ॥)
విడువక మూఁకొంటే విరుదా బసురువేసు
తడవుగా వీడెమైతే తాలిక గట్టు
వుడుగక మాఁటాడితే వూఁకొన వేసటవును
తడవకురే పతిని తానే వచ్చీఁగాని

(॥మొగ॥)
పలుమారుఁ గొసరితే పచ్చిదేరు వలపులు
తలపట్టి మొక్కఁ బోతే చండిపడును
కెలసి సారె నవ్వితే కేరడములై తోఁచు
తలఁపించు దూరకురే తానే వచ్చీఁగాని

(॥మొగ॥)
చెక్కు నొక్కి వేఁడుకొంటే చెమటలే చేయి నిండు
వెక్కసానఁ బెనఁగితే వీడుఁ దురుము
యిక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
తక్కించకురే దినమూ తానే వచ్చీఁగానీ

(||pallavi||)
mŏgasāḍu seyagure mudidalāla padigi
tagavĕṁchi sūsugŏni tāne vachchīm̐gāni

(||mŏga||)
viḍuvaga mūm̐kŏṁṭe virudā basuruvesu
taḍavugā vīḍĕmaide tāliga gaṭṭu
vuḍugaga mām̐ṭāḍide vūm̐kŏna vesaḍavunu
taḍavagure padini tāne vachchīm̐gāni

(||mŏga||)
palumārum̐ gŏsaride pachchideru valabulu
talabaṭṭi mŏkkam̐ bode saṁḍibaḍunu
kĕlasi sārĕ navvide keraḍamulai tom̐su
talam̐piṁchu dūragure tāne vachchīm̐gāni

(||mŏga||)
sĕkku nŏkki vem̐ḍugŏṁṭe sĕmaḍale seyi niṁḍu
vĕkkasānam̐ bĕnam̐gide vīḍum̐ durumu
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
takkiṁchagure dinamū tāne vachchīm̐gānī