(॥పల్లవి॥)
మొగమోటము దరచు మొదల నాకు
యెగసక్కే లాడనోప నీతని నేమందునే
(॥మొగ॥)
కడు బ్రియాలు చెప్పగా కాదని పెనఁగరాదు
అడరి పైకొనఁగాను అలుగరాదు
విడియ మొసగఁగాను వేసారుకొనఁగరాదు
యెడసి ఇప్పుడు వచ్చె నీతని నేమందునే
(॥మొగ॥)
మోముచూచి నవ్వఁగాను మొనసి తిట్టఁగరాదు
దోమటి దొడుకఁగాను తొలఁగరాదు
చేముంచి చెనకఁగాను సిగ్గులు వడఁగరాదు
యేమరించి కాఁగిలించీ నీతని నేమందునే
(॥మొగ॥)
చనవు నాకియ్యఁగాను సమ్మతించననరాదు
పనులు చెప్పఁగాను ఓపననరాదు
యెనయుచు శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
యినుమడించె వలపు లీతని నేమందునే
(||pallavi||)
mŏgamoḍamu darasu mŏdala nāgu
yĕgasakke lāḍanoba nīdani nemaṁdune
(||mŏga||)
kaḍu briyālu sĕppagā kādani pĕnam̐garādu
aḍari paigŏnam̐gānu alugarādu
viḍiya mŏsagam̐gānu vesārugŏnam̐garādu
yĕḍasi ippuḍu vachchĕ nīdani nemaṁdune
(||mŏga||)
momusūsi navvam̐gānu mŏnasi tiṭṭam̐garādu
domaḍi dŏḍugam̐gānu tŏlam̐garādu
semuṁchi sĕnagam̐gānu siggulu vaḍam̐garādu
yemariṁchi kām̐giliṁchī nīdani nemaṁdune
(||mŏga||)
sanavu nāgiyyam̐gānu sammadiṁchananarādu
panulu sĕppam̐gānu obananarādu
yĕnayusu śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
yinumaḍiṁchĕ valabu līdani nemaṁdune