Mogamemi soosevu muddaraalanu

మొగమేమి చూచేవు ముద్దరాలను
Language

(॥పల్లవి॥)
మొగమేమి చూచేవు ముద్దరాలను
వెగటైనదానఁ గాను వెఱవకు మిఁకను

(॥పల్లవి॥)
చలమెంత గలిగినా చనవే మెరసేఁగాని
బలిమిసేయను నీవు పంతగాఁడవు
అలుకెంత గలిగినా అందుకు మొక్కేఁగాని
వెలుపల దూర నిన్ను వెఱవకు మిఁకను

(॥మొగ॥)
వాసి యెంత గలిగినా వద్దనే వుండేఁగాని
పాసిపోను నేరుపుల బలువాఁడవు
వేసటెంత గలిగినా వేడుకతో నుండేఁ గాని
వీసమంతాఁ బదరను వెఱవకు మిఁకను

(॥మొగ॥)
కూరిమెంత గలిగినా కొంగువట్టుకుండేఁ గాని
మేరలు దప్పను నీవు మేనవాఁడవు
ఆరీతి శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
వీరువారు నేమనేరు వెఱవకు మిఁకను

(||pallavi||)
mŏgamemi sūsevu muddarālanu
vĕgaḍainadānam̐ gānu vĕṟavagu mim̐kanu

(||pallavi||)
salamĕṁta galiginā sanave mĕrasem̐gāni
balimiseyanu nīvu paṁtagām̐ḍavu
alugĕṁta galiginā aṁdugu mŏkkem̐gāni
vĕlubala dūra ninnu vĕṟavagu mim̐kanu

(||mŏga||)
vāsi yĕṁta galiginā vaddane vuṁḍem̐gāni
pāsibonu nerubula baluvām̐ḍavu
vesaḍĕṁta galiginā veḍugado nuṁḍem̐ gāni
vīsamaṁtām̐ badaranu vĕṟavagu mim̐kanu

(||mŏga||)
kūrimĕṁta galiginā kŏṁguvaṭṭuguṁḍem̐ gāni
meralu dappanu nīvu menavām̐ḍavu
ārīdi śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
vīruvāru nemaneru vĕṟavagu mim̐kanu