మొకదాకిరిని నీపై మోహమే చల్లుఁగాని
(॥పల్లవి॥)
మొకదాకిరిని నీపై మోహమే చల్లుఁగాని
వెకలితనాన నిన్ను వేసరించదు
(॥మొక॥)
యెఁ తైనాఁ జెలి నీతో యెదురు మాఁటాడదు
వంత గలిగితేఁ దలవంచుఁగాని
వింతవై తిరిగినాను వెగ్గళించదు నిన్ను
అంతలోనే వుసురసురనుఁగాని
(॥మొక॥)
యెరవుగ మఱచి నా యెంచదు నేరాలు నిన్ను
వొరిమెతో మోనాన నుండుఁగాని
విరహతాపము గల్లా విసుగదు నీమీఁద
సిరులచెక్కిటచేత చింతించుఁగాని
(॥మొక॥)
నవ్వులకయినా నీతో నాలివెంగే లాడదు
యివ్వలిమోమై విడె మిచ్చుఁగాని
రవ్వగా శ్రీవేంకటేశ రమణిఁ గూడితి నిట్టే
వువ్విళ్లూరఁ గాఁగిట నొనరుఁగాని
(||pallavi||)
mŏgadāgirini nībai mohame sallum̐gāni
vĕgalidanāna ninnu vesariṁchadu
(||mŏga||)
yĕm̐ tainām̐ jĕli nīdo yĕduru mām̐ṭāḍadu
vaṁta galigidem̐ dalavaṁchum̐gāni
viṁtavai tiriginānu vĕggaḽiṁchadu ninnu
aṁtalone vusurasuranum̐gāni
(||mŏga||)
yĕravuga maṟasi nā yĕṁchadu nerālu ninnu
vŏrimĕdo monāna nuṁḍum̐gāni
virahadābamu gallā visugadu nīmīm̐da
sirulasĕkkiḍaseda siṁtiṁchum̐gāni
(||mŏga||)
navvulagayinā nīdo nālivĕṁge lāḍadu
yivvalimomai viḍĕ michchum̐gāni
ravvagā śhrīveṁkaḍeśha ramaṇim̐ gūḍidi niṭṭe
vuvviḽlūram̐ gām̐giḍa nŏnarum̐gāni