Modalane seduletti mokkinaara mallanaamde

మొదలనే చేతులెత్తి మొక్కినార మల్లనాఁడె
Language

(॥పల్లవి॥)
మొదలనే చేతులెత్తి మొక్కినార మల్లనాఁడె
పదిఁ బదిగా నిఁక బతికించవయ్య

(॥మొద॥)
యెంత నీతో నలిగినా నేమీ ననక పోదు
వంతుకు నీవు వచ్చితే వద్దనఁ జాల
యింత మెత్తని మనసు యింతిని నిన్నేమి సే సే
పంతము నీ కిచ్చితిని పాలించవయ్యా

(॥మొద॥)
ఆలికిని మగనికిని ఆస లెప్పుడుఁ దీరవు
మేలిమి మాఁటాడితేను మెచ్చక మాన
తాలిమి మొగదాకిరి దానను నిన్నేమి సే సే
కాలమెల్ల నమ్మితిఁ గరుణించవయ్యా

(॥మొద॥)
యిదివో నీవు గూడితి వియ్యకొనకుంటేఁ బోదు
అదన శ్రీ వేంకటేశ అవుఁగాము లెంచ
యెదుట నీ కిచ్చలాడి యిఁక నిన్ను నేమి సే సే
చదురుఁదనాల నిఁక చనవియ్యవయ్యా

(||pallavi||)
mŏdalane sedulĕtti mŏkkināra mallanām̐ḍĕ
padim̐ badigā nim̐ka badigiṁchavayya

(||mŏda||)
yĕṁta nīdo naliginā nemī nanaga podu
vaṁtugu nīvu vachchide vaddanam̐ jāla
yiṁta mĕttani manasu yiṁtini ninnemi se se
paṁtamu nī kichchidini pāliṁchavayyā

(||mŏda||)
āligini maganigini āsa lĕppuḍum̐ dīravu
melimi mām̐ṭāḍidenu mĕchchaga māna
tālimi mŏgadāgiri dānanu ninnemi se se
kālamĕlla nammidim̐ garuṇiṁchavayyā

(||mŏda||)
yidivo nīvu gūḍidi viyyagŏnaguṁṭem̐ bodu
adana śhrī veṁkaḍeśha avum̐gāmu lĕṁcha
yĕduḍa nī kichchalāḍi yim̐ka ninnu nemi se se
sadurum̐danāla nim̐ka sanaviyyavayyā