Mimchi kaalamu kimdumeemdaayane

మించి కాలము కిందుమీఁదాయనే
Language

(॥పల్లవి॥)
మించి కాలము కిందుమీఁదాయనే
ఇంచుకంత దెరఁగు లే దేమిసేతమే

(॥మించి॥)
ధరలో మరునెలవు తలఁపులో చిత్తరువు
తరుణిమాటలలోనే తఱచాయనే
విరహపుటెండవేఁడి విరులకొసలవాఁడి
ఇరవాయనా యెందు నేమిసేతమే

(॥మించి॥)
కట్టలేని గాలిమోపు కడలేనివినుకులు
దట్టమాయ నీమగువతగువులనే
గుట్టులేని తమకము కోవిలలో సముకము
యె(యి?)ట్టె నాకిది యబ్బె నేమిసేతమే

(॥మించి॥)
వానలేనివరదులు వడలేనిదప్పులును
మానివికాఁగిటిలోనే మక్కళించీనే
పానినశ్రీవేంకటపతిగాన నన్నుఁగూడె
యీనెలఁత మెప్పించె నేమిసేతమే

(||pallavi||)
miṁchi kālamu kiṁdumīm̐dāyane
iṁchugaṁta dĕram̐gu le demisedame

(||miṁchi||)
dharalo marunĕlavu talam̐pulo sittaruvu
taruṇimāḍalalone taṟasāyane
virahabuḍĕṁḍavem̐ḍi virulagŏsalavām̐ḍi
iravāyanā yĕṁdu nemisedame

(||miṁchi||)
kaṭṭaleni gālimobu kaḍalenivinugulu
daṭṭamāya nīmaguvadaguvulane
guṭṭuleni tamagamu kovilalo samugamu
yĕ(yi?)ṭṭĕ nāgidi yabbĕ nemisedame

(||miṁchi||)
vānalenivaradulu vaḍalenidappulunu
mānivigām̐giḍilone makkaḽiṁchīne
pāninaśhrīveṁkaḍabadigāna nannum̐gūḍĕ
yīnĕlam̐ta mĕppiṁchĕ nemisedame