Mikkudabu suddulu neemeemda nunnavi

మిక్కుటపు సుద్దులు నీమీఁద నున్నవి
Language

(॥పల్లవి॥)
మిక్కుటపు సుద్దులు నీమీఁద నున్నవి
దక్కె నాకు నీ ప్రియము దాఁచఁగ నే నోపను

(॥మిక్కు॥)
రవ్వలేల సేసేవు రాతిరెల్ల నీవు మాతో
నవ్విన నవ్వులు నీపై నాఁగు వారీని
వువ్విళ్లూరెఁ జెమటలు వుప్పొలి కినుమడాయ
జవ్వనమె పై తరవు సాదించ నే నోపను

(॥మిక్కు॥)
పాఁచి కాఁగి లేమిటికి పట్టపగలే నీవు
రేఁచిన రేఁపులు దీన రెట్టి గొనీని
పూఁచి పులకలు నిండె పూఁప లెల్లఁ బిందెలాయ
దాఁచరాదు సిగ్గు నిన్నుఁ దప్పులెంచ నోపను

(॥మిక్కు॥)
కొసరకు మిఁక నన్నుఁ గూడిన కూటమి నీకు
ముసరి యాస మురిగి ముమ్మడయ్యీని
వెస నీవు మన్నించఁగ విరహమే చవులాయ
పొసఁగ శ్రీ వేంకటేశ బొంకఁగ నే నోపను

(||pallavi||)
mikkuḍabu suddulu nīmīm̐da nunnavi
dakkĕ nāgu nī priyamu dām̐sam̐ga ne nobanu

(||mikku||)
ravvalela sesevu rādirĕlla nīvu mādo
navvina navvulu nībai nām̐gu vārīni
vuvviḽlūrĕm̐ jĕmaḍalu vuppŏli kinumaḍāya
javvanamĕ pai taravu sādiṁcha ne nobanu

(||mikku||)
pām̐si kām̐gi lemiḍigi paṭṭabagale nīvu
rem̐sina rem̐pulu dīna rĕṭṭi gŏnīni
pūm̐si pulagalu niṁḍĕ pūm̐pa lĕllam̐ biṁdĕlāya
dām̐sarādu siggu ninnum̐ dappulĕṁcha nobanu

(||mikku||)
kŏsaragu mim̐ka nannum̐ gūḍina kūḍami nīgu
musari yāsa murigi mummaḍayyīni
vĕsa nīvu manniṁcham̐ga virahame savulāya
pŏsam̐ga śhrī veṁkaḍeśha bŏṁkam̐ga ne nobanu