Mikkilijaanalu tolle meerinnee neruduru

మిక్కిలిజాణలు తొల్లె మీరిన్నీ నేరుతురు
Language

(॥పల్లవి॥)
మిక్కిలిజాణలు తొల్లె మీరిన్నీ నేరుతురు
వక్కణ లడుగనేలా వలపు లీడేరెను

(॥మిక్కి॥)
మంతనాన నీవాడినమాటలు దలఁచుకొని
యింతి సంతోసాననున్న దేమంటివో
చెంత నుండి మేలు వార్త చెప్పవచ్చితిమి నేము
ఇంతంతనరాదు మీకు నిద్దరికే తెలుసు

(॥మిక్కి॥)
నీవు రాతిరెల్లాను మన్నించినమన్ననలు
బావించి పొగడుకొనీఁ బానుపుమీఁద
కావించి వేడుకలు కనివచ్చితిమి నేము
ఆవిధా లెట్టివోకాని యతిరహస్యములు

(॥మిక్కి॥)
చెలి వేగు బొద్దునను సేసీననీచేఁతలకు
సెలవుల నవ్వుకొంటా సిగ్గువడీని
యెలమి శ్రీవేంకటేశ యెనసితి రొండొరులు
అలవడె మీలోమీకు నమరె నన్నియును

(||pallavi||)
mikkilijāṇalu tŏllĕ mīrinnī neruduru
vakkaṇa laḍuganelā valabu līḍerĕnu

(||mikki||)
maṁtanāna nīvāḍinamāḍalu dalam̐sugŏni
yiṁti saṁtosānanunna demaṁṭivo
sĕṁta nuṁḍi melu vārda sĕppavachchidimi nemu
iṁtaṁtanarādu mīgu niddarige tĕlusu

(||mikki||)
nīvu rādirĕllānu manniṁchinamannanalu
bāviṁchi pŏgaḍugŏnīm̐ bānubumīm̐da
kāviṁchi veḍugalu kanivachchidimi nemu
āvidhā lĕṭṭivogāni yadirahasyamulu

(||mikki||)
sĕli vegu bŏddunanu sesīnanīsem̐talagu
sĕlavula navvugŏṁṭā sigguvaḍīni
yĕlami śhrīveṁkaḍeśha yĕnasidi rŏṁḍŏrulu
alavaḍĕ mīlomīgu namarĕ nanniyunu