Mettanimanasudaana mikkili nenoo

మెత్తనిమనసుదాన మిక్కిలి నేనూ
Language

(॥పల్లవి॥)
మెత్తనిమనసుదాన మిక్కిలి నేనూ
హత్తి నీవాడినట్టెల్లా నాడేనయ్యా

(॥మెత్త॥)
యిప్పటినీనవ్వు లివి యెన్నిటికైనావచ్చు
వుప్పటించనోప నూరకుండవయ్యా
దప్పిదేరె నిన్నుఁ జూచి దయవుట్టీ నంతలోనే
చెప్పేటిప్రియాలు నాకే సెలవాయన్యయ్యా

(॥మెత్త॥)
రొక్కపునీమాటలు రొంపిలోనికంబాలు
యెక్కడికెక్కడ మరి యెందాఁకానయ్యా
మొక్కేటినీవేసాలకు మొగమోట గనమాయ
మక్కువనీచేఁతలు సమ్మతైనట్టే అయ్యా

(॥మెత్త॥)
కందువనీరతు లివి కట్టినమంచిచద్దులు
చెంది నిన్నుఁ గూడితి తనిసితినయ్యా
అందపు శ్రీవేంకటేశ ఆసవుట్టీఁ గమ్మటిని
చందపునీమోవిలోనే చలిగొంటినయ్యా

(||pallavi||)
mĕttanimanasudāna mikkili nenū
hatti nīvāḍinaṭṭĕllā nāḍenayyā

(||mĕtta||)
yippaḍinīnavvu livi yĕnniḍigaināvachchu
vuppaḍiṁchanoba nūraguṁḍavayyā
dappiderĕ ninnum̐ jūsi dayavuṭṭī naṁtalone
sĕppeḍipriyālu nāge sĕlavāyanyayyā

(||mĕtta||)
rŏkkabunīmāḍalu rŏṁpilonigaṁbālu
yĕkkaḍigĕkkaḍa mari yĕṁdām̐kānayyā
mŏkkeḍinīvesālagu mŏgamoḍa ganamāya
makkuvanīsem̐talu sammadainaṭṭe ayyā

(||mĕtta||)
kaṁduvanīradu livi kaṭṭinamaṁchisaddulu
sĕṁdi ninnum̐ gūḍidi tanisidinayyā
aṁdabu śhrīveṁkaḍeśha āsavuṭṭīm̐ gammaḍini
saṁdabunīmovilone saligŏṁṭinayyā