Mettanaide digambade megulavaamdavu neevu

మెత్తనైతే దిగఁబడే మేకులవాఁడవు నీవు
Language

(॥పల్లవి॥)
మెత్తనైతే దిగఁబడే మేకులవాఁడవు నీవు
హత్తుకొనె నీలోని ఆస యెంత ఇఁకను

(॥మెత్త॥)
చల్లని చూపులఁ జూచి సరసములాడి ఇంతి
వెల్లవిరి సే సె నింకా వెలితేది
కొల్లున నవ్వుచు నింకా కొసరే వాపెను నీవు
అల్లనాఁడిఁ(డే) దక్కఁగొంటి వాస యెంత ఇఁకను

(॥మెత్త॥)
తగులఁగ మాఁటలాడి తనువులు సోఁకించి
వెగటుగా వలపించె వెలితేది
మొగమిచ్చలాడుతానే మొక్కేవాపెకు నీవు
అగడు సేసితివి నీ యాస యెంత ఇఁకను

(॥మెత్త॥)
కందువలు నీకుఁ జూపి కాఁగిట బిగించి కూడి
విందువెట్టి(ట్టె) నీకు మోవి వెలితేది
అంది శ్రీ వేంకటేశ నీ యక్కునఁ బెట్టుకొంటివి
అందాలుగా సింగారించేవాస యెంత ఇఁకను

(||pallavi||)
mĕttanaide digam̐baḍe megulavām̐ḍavu nīvu
hattugŏnĕ nīloni āsa yĕṁta im̐kanu

(||mĕtta||)
sallani sūbulam̐ jūsi sarasamulāḍi iṁti
vĕllaviri se sĕ niṁkā vĕlidedi
kŏlluna navvusu niṁkā kŏsare vābĕnu nīvu
allanām̐ḍim̐(ḍe) dakkam̐gŏṁṭi vāsa yĕṁta im̐kanu

(||mĕtta||)
tagulam̐ga mām̐ṭalāḍi tanuvulu som̐kiṁchi
vĕgaḍugā valabiṁchĕ vĕlidedi
mŏgamichchalāḍudāne mŏkkevābĕgu nīvu
agaḍu sesidivi nī yāsa yĕṁta im̐kanu

(||mĕtta||)
kaṁduvalu nīgum̐ jūbi kām̐giḍa bigiṁchi kūḍi
viṁduvĕṭṭi(ṭṭĕ) nīgu movi vĕlidedi
aṁdi śhrī veṁkaḍeśha nī yakkunam̐ bĕṭṭugŏṁṭivi
aṁdālugā siṁgāriṁchevāsa yĕṁta im̐kanu