మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూ&
పల్లవి:
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
చరణం 1:
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాదేనా
చరణం 2:
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలొ జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన....
pallavi:
mĕrise tāralade rūbaṁ virise pūvulade rūbaṁ
adi nā kaṁṭigi śhūnyaṁ
manasuna kŏluvai mamadala nĕlavai vĕlasina devidi e rūbaṁ
nā kannulu sūḍani rūbaṁ guḍilo devada pradirūbaṁ
nī rūbaṁ aburūbaṁ
saraṇaṁ 1:
ĕvari rāgado gaḽamuna pāḍala eruvāga sāgeno
ā vasaṁta māsabu kulagŏtrālanu ĕla koyila aḍigenā
ĕvari pilubudo pulagariṁchi puri vippi tanuvu ūgeno
ā tŏlagari meghabu guṇagaṇālagai nĕmali vĕdugulādenā
saraṇaṁ 2:
prāṇaṁ puṭṭuga prāṇigi tĕliyālā
gānaṁ puṭṭuga gātraṁ sūḍālā
prāṇaṁ puṭṭuga prāṇigi tĕliyālā
gānaṁ puṭṭuga gātraṁ sūḍālā
vĕdurunu muraḽiga malasi ī vĕdurunu muraḽiga malasi
nālŏ jīvana nādaṁ paligina nīve
nā prāṇa spaṁdana
nīge nā hṛdaya nivedana....