(॥పల్లవి॥)
మేనవారినేల మేకులు సేసేవు
ఆనలు వెట్టకు ఆయాలంటి
(॥మేన॥)
కూరిమిగొసరి కొంగేల పట్టేవు
ఆరీతిఁ బెనఁగకు మంతేసి
వూరకే పొందఁగా నొద్దంటినా నేను
సారెకుఁ దూరకు చండిసేసి
(॥మేన॥)
యెలయించి మాతో నేఁటికి నవ్వేవు
అలయించకుమీ అంతేసి
పలుకఁగా నీతో పంతాన నుంటినా
చలము చూపకు జాగుసేసి
(॥మేన॥)
యెనసి మాకొప్పు యేమి జారించేవు
అనువాయఁ బోర కంతేసి
చెనకనైతినా శ్రీవేంకటేశుఁడ
పెనఁగకు మిఁక బేండుసేసి
(||pallavi||)
menavārinela megulu sesevu
ānalu vĕṭṭagu āyālaṁṭi
(||mena||)
kūrimigŏsari kŏṁgela paṭṭevu
ārīdim̐ bĕnam̐gagu maṁtesi
vūrage pŏṁdam̐gā nŏddaṁṭinā nenu
sārĕgum̐ dūragu saṁḍisesi
(||mena||)
yĕlayiṁchi mādo nem̐ṭigi navvevu
alayiṁchagumī aṁtesi
palugam̐gā nīdo paṁtāna nuṁṭinā
salamu sūbagu jāgusesi
(||mena||)
yĕnasi māgŏppu yemi jāriṁchevu
anuvāyam̐ bora kaṁtesi
sĕnaganaidinā śhrīveṁkaḍeśhum̐ḍa
pĕnam̐gagu mim̐ka beṁḍusesi