(॥పల్లవి॥)
మేమును నీవారమే మేనవారమే
సాములుసేసి వలపు చల్లవయ్యా
(॥మేము॥)
యెక్కడలేని పరాకు యెంతైనాఁ గద్దు నీకు
చొక్కపుఁజేపుల మమ్ముఁ జూడవయ్యా
తక్కక జూజమాడేతమి యెంతైనాఁ గద్దు
అక్కరై మాతో ముచ్చటలాడవయ్యా
(॥మేము॥)
కన్నచోటనే చుట్టరికము లెంతైనాఁ గద్దు
చిన్నదాన నా పొందు సేయవయ్యా
పన్నిన కతలమీఁదిబాఁతి యెంతైనాఁ గద్దు
విన్నపాలు మాచేతివి వినవయ్యా
(॥మేము॥)
కూరిమిసతులతోడి కూట మెంతైనాఁ గద్దు
కోరి నన్ను రతులఁ జేకొనవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ నన్ను నేలితివి
మేరలు మీరక యిట్టె మెచ్చవయ్యా
(||pallavi||)
memunu nīvārame menavārame
sāmulusesi valabu sallavayyā
(||memu||)
yĕkkaḍaleni parāgu yĕṁtainām̐ gaddu nīgu
sŏkkabum̐jebula mammum̐ jūḍavayyā
takkaga jūjamāḍedami yĕṁtainām̐ gaddu
akkarai mādo muchchaḍalāḍavayyā
(||memu||)
kannasoḍane suṭṭarigamu lĕṁtainām̐ gaddu
sinnadāna nā pŏṁdu seyavayyā
pannina kadalamīm̐dibām̐ti yĕṁtainām̐ gaddu
vinnabālu māsedivi vinavayyā
(||memu||)
kūrimisaduladoḍi kūḍa mĕṁtainām̐ gaddu
kori nannu radulam̐ jegŏnavayyā
yīrīdi śhrīveṁkaḍeśha nannu nelidivi
meralu mīraga yiṭṭĕ mĕchchavayyā