మెలుఁత నిన్నిటాను మెచ్చితి నేను
(॥పల్లవి॥)
మెలుఁత నిన్నిటాను మెచ్చితి నేను
ఫలియించె నేఁడు నాభాగ్యమెల్ల నిపుడు
(॥మెలు॥)
తరుణి నీమాటలు తారుకాణ వచ్చెనే
నెరజాణతనములు నేర్చు నతఁడు
సొరిది నాతో వీవన్నసుద్దులెల్లా జెప్పెవే
పొరిఁ జక్కఁదనములు పోగైనవాఁడే
(॥మెలు॥)
కాంత నీవుసేసేవుపకారము నీడేరెనే
వంతుతో నావున్నాడకు వచ్చె నతఁడు
సంతోసముసేసి నాకు చనవెల్లా నిచ్చెనే
యెంతకెంత వానిగుణ మేమనిచెప్పుదునే
(॥మెలు॥)
చెలి నీవు వొడఁబరచినమేలు దక్కెనే
పలుమారు నన్నుఁగూడి పాయఁడతఁడు
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడ
కలిగె నాకు నిఁక గైకొంటి వేడుకలు
(||pallavi||)
mĕlum̐ta ninniḍānu mĕchchidi nenu
phaliyiṁchĕ nem̐ḍu nābhāgyamĕlla nibuḍu
(||mĕlu||)
taruṇi nīmāḍalu tārugāṇa vachchĕne
nĕrajāṇadanamulu nersu nadam̐ḍu
sŏridi nādo vīvannasuddulĕllā jĕppĕve
pŏrim̐ jakkam̐danamulu pogainavām̐ḍe
(||mĕlu||)
kāṁta nīvusesevubagāramu nīḍerĕne
vaṁtudo nāvunnāḍagu vachchĕ nadam̐ḍu
saṁtosamusesi nāgu sanavĕllā nichchĕne
yĕṁtagĕṁta vāniguṇa memanisĕppudune
(||mĕlu||)
sĕli nīvu vŏḍam̐barasinamelu dakkĕne
palumāru nannum̐gūḍi pāyam̐ḍadam̐ḍu
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍa
kaligĕ nāgu nim̐ka gaigŏṁṭi veḍugalu