Melumelu sadulellaa mechchiri ninnu

మేలుమేలు సతులెల్లా మెచ్చిరి నిన్ను
Language

(॥పల్లవి॥)
మేలుమేలు సతులెల్లా మెచ్చిరి నిన్ను
వేళతో మా విన్నపాలు వింటివి నీవు

(॥మేలు॥)
చతురుఁడవైనందుకు జాణవు నీవైనందుకు
అతివను మన్నించితి వదివొ నీవు
కతలు నేర్చినందుకు కడుమేటివైనందుకు
తతెఱిఁగి వచ్చితివి దయతో నీవు

(॥మేలు॥)
సంతోసించుకొన్నందుకు సమ్మతించినందుకు
యింతికిఁ జనవిచ్చితి విపుడే నీవు
ఇంతచుట్టమవైనందు కింపుగలిగినందుకు
పొంతనే లాలించితివి బుజ్జగించి నీవు

(॥మేలు॥)
సలిగె ఇచ్చినందుకు సరసుఁడవైనందుకు
అలమేల్ మంగ గూడితి వన్నిటా నీవు
కలిగినందుకు శ్రీవేంకటపతివైనందుకు
తెలిపితివి నీపొందు దీననే నీవు

(||pallavi||)
melumelu sadulĕllā mĕchchiri ninnu
veḽado mā vinnabālu viṁṭivi nīvu

(||melu||)
sadurum̐ḍavainaṁdugu jāṇavu nīvainaṁdugu
adivanu manniṁchidi vadivŏ nīvu
kadalu nersinaṁdugu kaḍumeḍivainaṁdugu
tadĕṟim̐gi vachchidivi dayado nīvu

(||melu||)
saṁtosiṁchugŏnnaṁdugu sammadiṁchinaṁdugu
yiṁtigim̐ janavichchidi vibuḍe nīvu
iṁtasuṭṭamavainaṁdu kiṁpugaliginaṁdugu
pŏṁtane lāliṁchidivi bujjagiṁchi nīvu

(||melu||)
saligĕ ichchinaṁdugu sarasum̐ḍavainaṁdugu
alamel maṁga gūḍidi vanniḍā nīvu
kaliginaṁdugu śhrīveṁkaḍabadivainaṁdugu
tĕlibidivi nībŏṁdu dīnane nīvu