మేలుమేలే వోపుదువే మించి యంతపనికైనా
(॥పల్లవి॥)
మేలుమేలే వోపుదువే మించి యంతపనికైనా
పోలించి చెలులమెల్లాఁ బొగడేమే నిన్నును
(॥మేలు॥)
వాసి గలదానికి వలపులీడేరునే
వేసరనిదానికి వినయము చెల్లునే
మోసపోనిదానికి ముచ్చటలొనరునే
బేసబెల్లిదానికి సెనఁగఁదగునే
(॥మేలు॥)
చుట్టమైనదానికి సొలయఁ బొసఁగునే
గుట్టుగలదానికి సిగ్గులు వడఁగూడునే
దిట్టయైనదానికి తిట్టినా నమరునే
గుట్టవాయదానికిఁ గరఁగించవచ్చునే
(॥మేలు॥)
చెల్లుబడైన దానికి చేఁతలు దగవౌనే
యిల్లాలైన దానికి నెనయ నేరుపౌనే
వెల్లవిరిగాను శ్రీవేంకటేశుఁడేలె నిన్ను
యెల్లగా నీవంటిదాని కిన్నియుఁ జొప్పడునే
(||pallavi||)
melumele vobuduve miṁchi yaṁtabanigainā
poliṁchi sĕlulamĕllām̐ bŏgaḍeme ninnunu
(||melu||)
vāsi galadānigi valabulīḍerune
vesaranidānigi vinayamu sĕllune
mosabonidānigi muchchaḍalŏnarune
besabĕllidānigi sĕnam̐gam̐dagune
(||melu||)
suṭṭamainadānigi sŏlayam̐ bŏsam̐gune
guṭṭugaladānigi siggulu vaḍam̐gūḍune
diṭṭayainadānigi tiṭṭinā namarune
guṭṭavāyadānigim̐ garam̐giṁchavachchune
(||melu||)
sĕllubaḍaina dānigi sem̐talu dagavaune
yillālaina dānigi nĕnaya nerubaune
vĕllavirigānu śhrīveṁkaḍeśhum̐ḍelĕ ninnu
yĕllagā nīvaṁṭidāni kinniyum̐ jŏppaḍune