మేలుమేలే నీ కతలు మెరసె నేఁడు
(॥పల్లవి॥)
మేలుమేలే నీ కతలు మెరసె నేఁడు
పోలించి పోలించి నీ పొందులు నెరపేవు
(॥మేలు॥)
వీడెము చేతఁబట్టుక విభుని కియ్యవచ్చేవు
యేడ నేరుచుకొంటివే యిచ్చకములు
తొడఁదొడఁ బాదాలు తుడిచేవు పయ్యదను
వాడికసేసుక యెంత వలపు చల్లేవే
(॥మేలు॥)
మిన్నక జారకతొల్లె మేనఁగుప్పేవు రెంటెము
వెన్నతోఁ బెట్టిరటె యీవేసాలు నీకు
చన్నులు చూపుకొంటాను సారెఁ గొలువు సేసేవు
పన్ని నీసింగారా లెంత పచారించేవే
(॥మేలు॥)
గోరికొన సొఁకఁగాను కురులూరకె దిద్దేవు
చేరి నీబత్తి యింతేసి చేయవలెనా
వేరులే కలమేల్‌మంగవిభుఁడు శ్రీవేంకటేశుఁ-
డీరీతి నన్నేలె నీవెంత పొగడేవే
(||pallavi||)
melumele nī kadalu mĕrasĕ nem̐ḍu
poliṁchi poliṁchi nī pŏṁdulu nĕrabevu
(||melu||)
vīḍĕmu sedam̐baṭṭuga vibhuni kiyyavachchevu
yeḍa nerusugŏṁṭive yichchagamulu
tŏḍam̐dŏḍam̐ bādālu tuḍisevu payyadanu
vāḍigasesuga yĕṁta valabu salleve
(||melu||)
minnaga jāragadŏllĕ menam̐guppevu rĕṁṭĕmu
vĕnnadom̐ bĕṭṭiraḍĕ yīvesālu nīgu
sannulu sūbugŏṁṭānu sārĕm̐ gŏluvu sesevu
panni nīsiṁgārā lĕṁta pasāriṁcheve
(||melu||)
gorigŏna sŏm̐kam̐gānu kurulūragĕ diddevu
seri nībatti yiṁtesi seyavalĕnā
verule kalamelmaṁgavibhum̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍīrīdi nannelĕ nīvĕṁta pŏgaḍeve