మేలుమేలనుచు మిమ్ము మెచ్చేఁ గాని
(॥పల్లవి॥)
మేలుమేలనుచు మిమ్ము మెచ్చేఁ గాని
సోసి మీవద్దఁ గూచుండే చోటియ్యవయ్య
(॥మేలు॥)
విందముగాని నీవు వేడుకలెల్లా మెరసి
ఆందముగాఁ జెప్పవయ్యా ఆపెసుద్దులు
చెంది సిగ్గులువడక శిరసు వంచుకొనక
ముందర నిలుచుండి నీమోము చూపవయ్య
(॥మేలు ॥)
చూతముగాని యాపె సోయగపుగురుతులు
యీతరిఁ బిలువవయ్యా యెటువంటిదో
యేతుల కోపననక యింతటిలోనే నగక
నీతలఁపుఁ దెలుసుకొనే నిందు రావయ్యా
(॥మేలు॥)
ఇయ్యకొందముగాని యీసతి జాణతనాలు
ఇయ్యెడఁ బచారింపించనీవయ్యా నీవు
నెయ్యపుశ్రీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి
వుయ్యాలమంచము మీఁద నుండఁగదవయ్య
(||pallavi||)
melumelanusu mimmu mĕchchem̐ gāni
sosi mīvaddam̐ gūsuṁḍe soḍiyyavayya
(||melu||)
viṁdamugāni nīvu veḍugalĕllā mĕrasi
āṁdamugām̐ jĕppavayyā ābĕsuddulu
sĕṁdi sigguluvaḍaga śhirasu vaṁchugŏnaga
muṁdara nilusuṁḍi nīmomu sūbavayya
(||melu ||)
sūdamugāni yābĕ soyagabugurudulu
yīdarim̐ biluvavayyā yĕḍuvaṁṭido
yedula kobananaga yiṁtaḍilone nagaga
nīdalam̐pum̐ dĕlusugŏne niṁdu rāvayyā
(||melu||)
iyyagŏṁdamugāni yīsadi jāṇadanālu
iyyĕḍam̐ basāriṁpiṁchanīvayyā nīvu
nĕyyabuśhrīveṁkaḍeśha nem̐ḍu nannu nelidivi
vuyyālamaṁchamu mīm̐da nuṁḍam̐gadavayya