మేలు విచ్చి చెప్పరాదు మేడిపంటి బోనము
(॥పల్లవి॥)
మేలు విచ్చి చెప్పరాదు మేడిపంటి బోనము
కాలమందే కంటి వింటిఁ గత లేఁటికనవే
(॥మేలు॥)
మొక్కేననీ వీఁడు ముందట నిదేమే తొల్లి
మొక్కినదేవరకే మొక్కమనవే
చెక్కిటిది నాచేయి చిత్తము దనకు రాయి
యిక్కువలు గరఁగీని యేమందునే
(॥మేలు॥)
వట్టీ నూరకె తాను పయ్యద నాచెఱఁగు తాఁ
బట్టినచలము చెల్లెఁ బదమనవే
మెట్టినది పాఁతర మీరి చెప్పె కొండెము
యెట్టైనాఁ జేయనీవే యొదురెవ్వరే
(॥మేలు॥)
తగిలీ నూరకె తాను తతిగొని వెంటవెంట
తగిలె మోహము నాకుఁ దనిమీదనె
చిగురొత్త నన్నుఁ గూడె శ్రీ వేంకటేశుఁడు
తగవాయఁ బనులెల్లా తారుకాణలేలే
(||pallavi||)
melu vichchi sĕpparādu meḍibaṁṭi bonamu
kālamaṁde kaṁṭi viṁṭim̐ gada lem̐ṭiganave
(||melu||)
mŏkkenanī vīm̐ḍu muṁdaḍa nideme tŏlli
mŏkkinadevarage mŏkkamanave
sĕkkiḍidi nāseyi sittamu danagu rāyi
yikkuvalu garam̐gīni yemaṁdune
(||melu||)
vaṭṭī nūragĕ tānu payyada nāsĕṟam̐gu tām̐
baṭṭinasalamu sĕllĕm̐ badamanave
mĕṭṭinadi pām̐tara mīri sĕppĕ kŏṁḍĕmu
yĕṭṭainām̐ jeyanīve yŏdurĕvvare
(||melu||)
tagilī nūragĕ tānu tadigŏni vĕṁṭavĕṁṭa
tagilĕ mohamu nāgum̐ danimīdanĕ
sigurŏtta nannum̐ gūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu
tagavāyam̐ banulĕllā tārugāṇalele