మేలు మేలు యిన్నిటాను మెరసె నీ చేఁతలు
(॥పల్లవి॥)
మేలు మేలు యిన్నిటాను మెరసె నీ చేఁతలు
పోలించి చూడరమ్మ పొలఁతి భావములు
(॥మేలు॥)
చింతలేక సిగ్గులనే చెక్కిటఁ జేయి వెట్టీని
పొంతములుగాఁ జాఁచీని కొనచూపులు
బంతి గట్టకే నురిపీఁ బచ్చి మోవినవ్వులు
యెంతని చెప్పుదమమ్మా యీ కాంత భావములు
(॥మేలు॥)
అలయకే చెమటలు అంగమెల్లా నించుకొనీ
పలుకుల చిలుకలఁ బౌఁచు వెట్టీని
వలిపె వలల వేసీ వడిఁ జన్ను జక్కవల
తలఁచరాదమ్మా యీ తరుణి భావములు
(॥మేలు॥)
గరువు చెప్పని సాము కుచ్చి కాఁగిటనే చేసీ
తొరలి శ్రీవేంకటేశు తోడి రతుల
పొరి మెయిఁ దీగెనే కుచ్చీఁ బులకల తోరణాలు
యిరవై నిలుచెనమ్మా యీ యింతి భావములు
(||pallavi||)
melu melu yinniḍānu mĕrasĕ nī sem̐talu
poliṁchi sūḍaramma pŏlam̐ti bhāvamulu
(||melu||)
siṁtalega siggulane sĕkkiḍam̐ jeyi vĕṭṭīni
pŏṁtamulugām̐ jām̐sīni kŏnasūbulu
baṁti gaṭṭage nuribīm̐ bachchi movinavvulu
yĕṁtani sĕppudamammā yī kāṁta bhāvamulu
(||melu||)
alayage sĕmaḍalu aṁgamĕllā niṁchugŏnī
palugula silugalam̐ baum̐su vĕṭṭīni
valibĕ valala vesī vaḍim̐ jannu jakkavala
talam̐sarādammā yī taruṇi bhāvamulu
(||melu||)
garuvu sĕppani sāmu kuchchi kām̐giḍane sesī
tŏrali śhrīveṁkaḍeśhu toḍi radula
pŏri mĕyim̐ dīgĕne kuchchīm̐ bulagala toraṇālu
yiravai nilusĕnammā yī yiṁti bhāvamulu