మేలు మేలు విభుఁడా మెచ్చితి నిన్ను నిపుడు
(॥పల్లవి॥)
మేలు మేలు విభుఁడా మెచ్చితి నిన్ను నిపుడు
చాలునన్నా వినయాలు సారె సారె వలెనా
(॥మేలు॥)
నిన్ననేఁటి పొందులా నీవే నేఁగానా
మన్ననల నింతేసి మరిగించవలెనా
వన్నె నీపోలికే కానా వావు లొక్కసరి గాదా
పన్ని యిఁక నన్ను నొడఁబరచఁగ వలెనా
(॥మేలు॥)
బాసచేసుకొనమా భావములు వెలితా
సేసపట్టి నీ గుణాలు చెప్పవలెనా
ఆసలెల్ల దక్కవా అప్పుడే మొక్కవా
వేసర కింకా నన్ను వేడుకొనవలెనా
(॥మేలు॥)
గక్కున మోహించమా కన్నులఁదనియమా
చెక్కు నొక్కి బుజ్జగించి సేవ సేయవలెనా
యిక్కువ శ్రీవేంకటేశ యింతలోనె కూడితివి
నిక్కి నిక్కి చూచి నవ్వు నేఁడే నాతో వలెనా
(||pallavi||)
melu melu vibhum̐ḍā mĕchchidi ninnu nibuḍu
sālunannā vinayālu sārĕ sārĕ valĕnā
(||melu||)
ninnanem̐ṭi pŏṁdulā nīve nem̐gānā
mannanala niṁtesi marigiṁchavalĕnā
vannĕ nībolige kānā vāvu lŏkkasari gādā
panni yim̐ka nannu nŏḍam̐barasam̐ga valĕnā
(||melu||)
bāsasesugŏnamā bhāvamulu vĕlidā
sesabaṭṭi nī guṇālu sĕppavalĕnā
āsalĕlla dakkavā appuḍe mŏkkavā
vesara kiṁkā nannu veḍugŏnavalĕnā
(||melu||)
gakkuna mohiṁchamā kannulam̐daniyamā
sĕkku nŏkki bujjagiṁchi seva seyavalĕnā
yikkuva śhrīveṁkaḍeśha yiṁtalonĕ kūḍidivi
nikki nikki sūsi navvu nem̐ḍe nādo valĕnā