మేలు మేలు చెలులెల్లా మెచ్చిరి నీ చేఁతలకు
(॥పల్లవి॥)
మేలు మేలు చెలులెల్లా మెచ్చిరి నీ చేఁతలకు
చాలా నేరుపుల నీతో సరి యెవ్వరమ్మా
(॥మేలు॥)
పెదవినే మాఁటలాడి పిలిచేవు రమణుని
కదలుఁ గన్నులఁ జూచి కరఁగించేవు
వెదచల్లునవ్వులను వేడుకులు రేఁచేవు
చదురుఁదనాల నీతో సరి యెవ్వరమ్మా
(॥మేలు॥)
సన్నలనే యాతనితో సాములెల్లాఁ జేసేవు
తిన్నని తురుము చూపి తేలించేవు
చన్నులంటి వలపులు చవులు వుట్టించేవు
సన్నుతించేనంటే నీతో సరి యవ్వరమ్మా
(॥మేలు॥)
వింతగా మొక్కుతానే శ్రీవేంకటేశు నుబ్బించేవు
పొంత నలమేల్మంగవై పోది సేసేవు
యింతలోనే నిన్ను నేలె యీతఁ డిన్నిటా వలచి
సంతతము నీతో నింత సరి యవ్వరమ్మా
(||pallavi||)
melu melu sĕlulĕllā mĕchchiri nī sem̐talagu
sālā nerubula nīdo sari yĕvvarammā
(||melu||)
pĕdavine mām̐ṭalāḍi pilisevu ramaṇuni
kadalum̐ gannulam̐ jūsi karam̐giṁchevu
vĕdasallunavvulanu veḍugulu rem̐sevu
sadurum̐danāla nīdo sari yĕvvarammā
(||melu||)
sannalane yādanido sāmulĕllām̐ jesevu
tinnani turumu sūbi teliṁchevu
sannulaṁṭi valabulu savulu vuṭṭiṁchevu
sannudiṁchenaṁṭe nīdo sari yavvarammā
(||melu||)
viṁtagā mŏkkudāne śhrīveṁkaḍeśhu nubbiṁchevu
pŏṁta nalamelmaṁgavai podi sesevu
yiṁtalone ninnu nelĕ yīdam̐ ḍinniḍā valasi
saṁtadamu nīdo niṁta sari yavvarammā