Melu melu neejaada mechchidi nenu | nee

మేలు మేలు నీజాడ మెచ్చితి నేను । నీ
Language

(॥పల్లవి॥)
మేలు మేలు నీజాడ మెచ్చితి నేను । నీ-
వీలాగు గాకున్న నెన్ని కవుదువా

(॥మేలు॥)
కన్నుల నేఁ జూచితేనే కవకవ నవ్వేవు
వున్నతి నీకు నాకు నేవూరిపొందురా
యిన్నేసిజాణతనము నీవు నేరకున్న
మున్ను రుకుమిణి నీకు మోహించునా

(॥మేలు॥)
ఇంతుల నేఁ బిలిచితే నేమియని దగ్గరేవు
కొంతైన నే నిన్నుఁ బేరుకొంటినటరా
పొంత నిట్టె వుప్పువేసి పొత్తుగలయ వచ్చేవు
పంతము లేకుంటే శ్రీపతి వవుదువా

(॥మేలు॥)
ఇట్టె నేనేకతమైతే నిటు నన్నుఁ గూడితివి
వొట్టిననీకు నాకు వొడఁబాటురా
దిట్టవు శ్రీవేంకటేశ తెగు వింత లేకుండితే
జట్టికాఁడ నీకు నేను సతమవుదునా

(||pallavi||)
melu melu nījāḍa mĕchchidi nenu | nī-
vīlāgu gāgunna nĕnni kavuduvā

(||melu||)
kannula nem̐ jūsidene kavagava navvevu
vunnadi nīgu nāgu nevūribŏṁdurā
yinnesijāṇadanamu nīvu neragunna
munnu rugumiṇi nīgu mohiṁchunā

(||melu||)
iṁtula nem̐ biliside nemiyani daggarevu
kŏṁtaina ne ninnum̐ berugŏṁṭinaḍarā
pŏṁta niṭṭĕ vuppuvesi pŏttugalaya vachchevu
paṁtamu leguṁṭe śhrībadi vavuduvā

(||melu||)
iṭṭĕ nenegadamaide niḍu nannum̐ gūḍidivi
vŏṭṭinanīgu nāgu vŏḍam̐bāḍurā
diṭṭavu śhrīveṁkaḍeśha tĕgu viṁta leguṁḍide
jaṭṭigām̐ḍa nīgu nenu sadamavudunā