మేలు మేలు నీగుణాలు మెచ్చితి నేను
(॥పల్లవి॥)
మేలు మేలు నీగుణాలు మెచ్చితి నేను
పోలించి యీ లాగులనే భోగించవలెను
(॥మేలు॥)
వేసరఁగరాదు మరి వేగిరపడఁరాదు
సేసవెట్టిన పతితో చెలులకును
వాసులు పట్టఁగరాదు వంతులడుఁగఁగరాదు
తాసువలె సరిదూఁగి దండ నుండవలెను
(॥మేలు॥)
కన్నుల జంకించరాదు కరకరిసేయరాదు
మన్నన గలదంటాను మాటిమాటికి
యెన్నైనా వదలరాదు యెగ్గులు పట్టఁగరాదు
సన్నలనే మోవితేనె చవి చూపవలెను
(॥మేలు॥)
సరివెనఁగఁరాదు చలము సాదించరాదు
మరిగిన రతివేళ మంచము మీఁద
ఇరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
సరసములాడి ఇట్టె సమ్మతించవలెను
(||pallavi||)
melu melu nīguṇālu mĕchchidi nenu
poliṁchi yī lāgulane bhogiṁchavalĕnu
(||melu||)
vesaram̐garādu mari vegirabaḍam̐rādu
sesavĕṭṭina padido sĕlulagunu
vāsulu paṭṭam̐garādu vaṁtulaḍum̐gam̐garādu
tāsuvalĕ saridūm̐gi daṁḍa nuṁḍavalĕnu
(||melu||)
kannula jaṁkiṁcharādu karagariseyarādu
mannana galadaṁṭānu māḍimāḍigi
yĕnnainā vadalarādu yĕggulu paṭṭam̐garādu
sannalane movidenĕ savi sūbavalĕnu
(||melu||)
sarivĕnam̐gam̐rādu salamu sādiṁcharādu
marigina radiveḽa maṁchamu mīm̐da
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
sarasamulāḍi iṭṭĕ sammadiṁchavalĕnu