Melu melu nee suddulu menabaavaa

మేలు మేలు నీ సుద్దులు మేనబావా
Language

(॥పల్లవి॥)
మేలు మేలు నీ సుద్దులు మేనబావా
నోలవేయ కిఁక మాపై నో మేనబావా

(॥మేలు॥)
బచ్చన మాటలాడి పలుమారు నవ్వఁగాను
మెచ్చితిఁగా నే నిన్ను మేనబావా
లచ్చెనలు మేననించి లావులఁ బెనఁగఁగాను
వొచ్చెము లేదంటిఁగా నీ కోమేనబావా

(॥మేలు॥)
దట్టమై నావొద్దనె సందడి నీవు సేయఁగాను
మెట్టితిఁగా నీ పాదము మేనబావా
చుట్టమవై నాకు నీ సొమ్ములెల్లాఁ బెట్టఁగాను
వొట్టు లేదంటిఁగా నీ కోమేనబావా

(॥మేలు॥)
తాలిమితో వెంటవెంటఁ దగిలి నన్నేలితివి
మేలుగా శ్రీవేంకటాద్రిమేనబావా
ఆలనంటాఁ బొగడేవు అలమేలుమంగ నేను
వోలివెట్టితివి నాకు నోమేనబావా

(||pallavi||)
melu melu nī suddulu menabāvā
nolaveya kim̐ka mābai no menabāvā

(||melu||)
bachchana māḍalāḍi palumāru navvam̐gānu
mĕchchidim̐gā ne ninnu menabāvā
lachchĕnalu menaniṁchi lāvulam̐ bĕnam̐gam̐gānu
vŏchchĕmu ledaṁṭim̐gā nī komenabāvā

(||melu||)
daṭṭamai nāvŏddanĕ saṁdaḍi nīvu seyam̐gānu
mĕṭṭidim̐gā nī pādamu menabāvā
suṭṭamavai nāgu nī sŏmmulĕllām̐ bĕṭṭam̐gānu
vŏṭṭu ledaṁṭim̐gā nī komenabāvā

(||melu||)
tālimido vĕṁṭavĕṁṭam̐ dagili nannelidivi
melugā śhrīveṁkaḍādrimenabāvā
ālanaṁṭām̐ bŏgaḍevu alamelumaṁga nenu
volivĕṭṭidivi nāgu nomenabāvā