Melu melu maguvaa meradappam dagavaa

మేలు మేలు మగువా మేరదప్పఁ దగవా
Language

(॥పల్లవి॥)
మేలు మేలు మగువా మేరదప్పఁ దగవా
ఆలరి సేఁతలు సేసే వౌనౌనే నీవు

(॥మేలు॥)
కన్నులైతేఁ తే దేటలు ఘాతలైతే మేఁటులు
యెన్నడు నేరిచితివే యింతి నీవు
సన్నలైతేఁ జాయలు జాడలైతే మాయలు
అన్నిటా జాణవౌదు వవునౌనే నీవు

(॥మేలు॥)
తనువైతేఁ జిగురు తలఁపైతేఁ దగరు
ననుపైతి వెట్లాడే నాతి నీవు
పెనఁగితే నగవు బీరమైతే బిగువు
అనుమానమెల్లఁ దీరె అవునవునే నీవు

(॥మేలు॥)
మోవియైతేఁ దీపులు మోహపురారాఁపులు
వావి దెలిపితి వౌనే వనిత నీవు
శ్రీవేంకటేశుఁడ నేఁ జేకొంటిఁ గాఁగిట నిన్ను
ఆవిధమే చేకొంటి వవునౌనే నీవు

(||pallavi||)
melu melu maguvā meradappam̐ dagavā
ālari sem̐talu sese vaunaune nīvu

(||melu||)
kannulaidem̐ te deḍalu ghādalaide mem̐ṭulu
yĕnnaḍu nerisidive yiṁti nīvu
sannalaidem̐ jāyalu jāḍalaide māyalu
anniḍā jāṇavaudu vavunaune nīvu

(||melu||)
tanuvaidem̐ jiguru talam̐paidem̐ dagaru
nanubaidi vĕṭlāḍe nādi nīvu
pĕnam̐gide nagavu bīramaide biguvu
anumānamĕllam̐ dīrĕ avunavune nīvu

(||melu||)
moviyaidem̐ dībulu mohaburārām̐pulu
vāvi dĕlibidi vaune vanida nīvu
śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ jegŏṁṭim̐ gām̐giḍa ninnu
āvidhame segŏṁṭi vavunaune nīvu