మేలు మేలు కాంతలకు మేకు సేయ నేరుతువు
(॥పల్లవి॥)
మేలు మేలు కాంతలకు మేకు సేయ నేరుతువు
తాలిమితో నన్నిటా నాదరించ నేరుతువు
(॥మేలు॥)
పంతగాఁడ వౌదువు పదారువేలు సతుల
బంతిఁబెట్టి వొక్కమాటే భ్రమఇంచితి
యెంతవాఁడనైనా నౌదు వెమ్మెలకు సీతాదేవి-
నంతవట్టువారు జూడ నగ్గి బాస గొంటివి
(॥మేలు॥)
అలరుక్మిణిఁ బెండ్లాడి ఆకెయన్నను బోదించి
లలి సంతోసముగా సెలవు సేసితి
పాలసి సత్యభామకు పూవు దెచ్చి చేతికిచ్చి
యెలమి సవతులలో నెక్కుడు సేసితివి
(॥మేలు॥)
వీఁపున భూకాంత నిల్లి వేడుకతో శ్రీలక్ష్మిని
మోపుగా నే పొద్దు నురమున నించితి
కాపాడి మిక్కిలి ననుఁ గరుణించి కాఁగిలించి
యేపున శ్రీవేంకటేశ యేలి మన్నించితివి
(||pallavi||)
melu melu kāṁtalagu megu seya neruduvu
tālimido nanniḍā nādariṁcha neruduvu
(||melu||)
paṁtagām̐ḍa vauduvu padāruvelu sadula
baṁtim̐bĕṭṭi vŏkkamāḍe bhrama̮iṁchidi
yĕṁtavām̐ḍanainā naudu vĕmmĕlagu sīdādevi-
naṁtavaṭṭuvāru jūḍa naggi bāsa gŏṁṭivi
(||melu||)
alarukmiṇim̐ bĕṁḍlāḍi āgĕyannanu bodiṁchi
lali saṁtosamugā sĕlavu sesidi
pālasi satyabhāmagu pūvu dĕchchi sedigichchi
yĕlami savadulalo nĕkkuḍu sesidivi
(||melu||)
vīm̐puna bhūgāṁta nilli veḍugado śhrīlakṣhmini
mobugā ne pŏddu nuramuna niṁchidi
kābāḍi mikkili nanum̐ garuṇiṁchi kām̐giliṁchi
yebuna śhrīveṁkaḍeśha yeli manniṁchidivi