మేలు మేలే యితఁడు నేర్చును మెచ్చితి నన్నిటా నీతని కూటమి
(॥పల్లవి॥)
మేలు మేలే యితఁడు నేర్చును మెచ్చితి నన్నిటా నీతని కూటమి
కోలుముందై యిటులఁ గోర్పులు కొనలు సాగని దేఁటిదే
(॥మేలు॥)
మనసు గరఁగఁగఁ జేయఁ జాలనిమాఁట లిన్నియు నేఁటివే
చనవు మిగులఁగ నోలలాడనిసరసములు మరియేఁటివే
తనివిఁ బొండఁగ రతులఁ గలయని తాలిముల గొడ వేఁటిదే
చెనకి చెనకించుకొని కొసరినిచేఁత లేమియు నేఁటివే
(॥మేలు॥)
పెదవి తేనియ లొలుకఁ జెప్పని ప్రియము చేకాన నేఁటిదే
యెదురుచూపులయాసలను బయలీఁదని వల పేఁటిదే
సదమదంబుగఁ బుక్కిటితమ్ములము చవులుగొననిది యెఁటిదే
ముదురుఁ దమకము మీఁదఁ జల్లుచు మొక్కులాడని దేఁటిదే
(॥మేలు॥)
చెలపచెమటలుగార సాలయుచు చిమ్మిరేఁగని దేఁటిదే
తలఁపుఁదలఁపునుఁ దారుకాణై తగిలి చొక్కని దేఁటిదే
యెలమితో శ్రీవేంకటేశ్వరుఁ డేలె నన్నిపు డతిముదంబున
చెలియ నీతో నిట్టివేడుక చెప్పి చూపని దేఁటిదే
(||pallavi||)
melu mele yidam̐ḍu nersunu mĕchchidi nanniḍā nīdani kūḍami
kolumuṁdai yiḍulam̐ gorbulu kŏnalu sāgani dem̐ṭide
(||melu||)
manasu garam̐gam̐gam̐ jeyam̐ jālanimām̐ṭa linniyu nem̐ṭive
sanavu migulam̐ga nolalāḍanisarasamulu mariyem̐ṭive
tanivim̐ bŏṁḍam̐ga radulam̐ galayani tālimula gŏḍa vem̐ṭide
sĕnagi sĕnagiṁchugŏni kŏsarinisem̐ta lemiyu nem̐ṭive
(||melu||)
pĕdavi teniya lŏlugam̐ jĕppani priyamu segāna nem̐ṭide
yĕdurusūbulayāsalanu bayalīm̐dani vala pem̐ṭide
sadamadaṁbugam̐ bukkiḍidammulamu savulugŏnanidi yĕm̐ṭide
mudurum̐ damagamu mīm̐dam̐ jallusu mŏkkulāḍani dem̐ṭide
(||melu||)
sĕlabasĕmaḍalugāra sālayusu simmirem̐gani dem̐ṭide
talam̐pum̐dalam̐punum̐ dārugāṇai tagili sŏkkani dem̐ṭide
yĕlamido śhrīveṁkaḍeśhvarum̐ ḍelĕ nannibu ḍadimudaṁbuna
sĕliya nīdo niṭṭiveḍuga sĕppi sūbani dem̐ṭide