మేలు మేలయ్యా నిన్ను మెచ్చితిమి నీ వింతిని
(॥పల్లవి॥)
మేలు మేలయ్యా నిన్ను మెచ్చితిమి నీ వింతిని
లాలింతురుగాక యీ లాగు సేతురా
(॥మేలు॥)
శిరసువంచుకుండితే సిగ్గుదేర్చవలెఁగాక
కరకరిఁబెట్టి యింత కాఁగిలింతురా
విరసాన నలిగితే వేఁడుకొనవలెఁగాక
పెరిగేకుచము లిట్టె పిసుకుదురా
(॥మేలు॥)
దవ్వులనే నిలుచుంటే దగ్గరిరావలెఁగాక
పవ్వళించి గజ నిమ్మపంట వేతురా
అవ్వలిమోమైతేను ఆదరించవలెఁగాక
కువ్వవడ కుచ్చెలకొంగువట్టి తీతురా
(॥మేలు॥)
మోనాన నుండితే మోవితేనె చవిగొంటగాక
కానుకగా నందుమీఁద గంటిసేతురా
ఔనని శ్రీవేంకటేశ అలమేల్ మంగఁ గూడితి
వానుక వుందువుగాక ఆఱడి సేతురా
(||pallavi||)
melu melayyā ninnu mĕchchidimi nī viṁtini
lāliṁturugāga yī lāgu sedurā
(||melu||)
śhirasuvaṁchuguṁḍide siggudersavalĕm̐gāga
karagarim̐bĕṭṭi yiṁta kām̐giliṁturā
virasāna naligide vem̐ḍugŏnavalĕm̐gāga
pĕrigegusamu liṭṭĕ pisugudurā
(||melu||)
davvulane nilusuṁṭe daggarirāvalĕm̐gāga
pavvaḽiṁchi gaja nimmabaṁṭa vedurā
avvalimomaidenu ādariṁchavalĕm̐gāga
kuvvavaḍa kuchchĕlagŏṁguvaṭṭi tīdurā
(||melu||)
monāna nuṁḍide movidenĕ savigŏṁṭagāga
kānugagā naṁdumīm̐da gaṁṭisedurā
aunani śhrīveṁkaḍeśha alamel maṁgam̐ gūḍidi
vānuga vuṁduvugāga āṟaḍi sedurā