Meleṟamganidaananaa mikkili nenu

మేలెఱఁగనిదాననా మిక్కిలి నేను
Language

(॥పల్లవి॥)
మేలెఱఁగనిదాననా మిక్కిలి నేను
చాలుకొన్న నీ గుణాలు చక్కఁగాక మానీనా

(॥మేలె॥)
చెల్లుబడై నీవు నాకు చెప్పినట్టు సేయఁగాను
గొల్లెతల సుద్దులకే కోపగించేనా
చల్లఁగా నీవు నాతో సరసములాడఁగాను
వొల్లనే నీ నేరములు వోరు వలెనా

(॥మేలె॥)
అంకెల నీవు నాయానకు లోనైవుండఁగా
ఇంక నెవ్వరిఁ దెచ్చినా యీసడించేనా
సంకెదీర నీవు నాకు చనవెల్లా నియ్యఁగాను
వుంకువై నీవు చెప్పఁగా నొడఁబడకుందునా

(॥మేలె॥)
ఇంత నన్నుఁ గూడి వురమెక్కించుక వుండఁగాను
పంతాన నీవెంతవున్నా పాడిదప్పేనా
చెంతల శ్రీ వేంకటేశ సిగ్గుదేర నవ్వితివి
వంతువాసు లెంచి నిన్ను వలఁబెట్టేనా

(||pallavi||)
melĕṟam̐ganidānanā mikkili nenu
sālugŏnna nī guṇālu sakkam̐gāga mānīnā

(||melĕ||)
sĕllubaḍai nīvu nāgu sĕppinaṭṭu seyam̐gānu
gŏllĕdala suddulage kobagiṁchenā
sallam̐gā nīvu nādo sarasamulāḍam̐gānu
vŏllane nī neramulu voru valĕnā

(||melĕ||)
aṁkĕla nīvu nāyānagu lonaivuṁḍam̐gā
iṁka nĕvvarim̐ dĕchchinā yīsaḍiṁchenā
saṁkĕdīra nīvu nāgu sanavĕllā niyyam̐gānu
vuṁkuvai nīvu sĕppam̐gā nŏḍam̐baḍaguṁdunā

(||melĕ||)
iṁta nannum̐ gūḍi vuramĕkkiṁchuga vuṁḍam̐gānu
paṁtāna nīvĕṁtavunnā pāḍidappenā
sĕṁtala śhrī veṁkaḍeśha siggudera navvidivi
vaṁtuvāsu lĕṁchi ninnu valam̐bĕṭṭenā