మేలే జాణతనాలు మిక్కిలి లాబగాఁడౌను
(॥పల్లవి॥)
మేలే జాణతనాలు మిక్కిలి లాబగాఁడౌను
కీలు చెప్పఁబోటే నాపై కేలు చాఁచీనే
(॥మేలే॥)
తగవులు చెప్పఁబోతే తమలోని మాటలకు
తగులనాడె నన్నుఁ దగునే తాను
మొగములు చూచి నేను మొక్కులు మొక్కఁగఁబోతే
చిగురుఁజేతులు వట్టి చెనకులు నించీనే
(॥మేలే॥)
ఇతవులు సేయఁబోతే ఇద్దరునుఁ గూచుండి
రతులకుఁ బెనఁగీనే రాజసానను
మితిమీరి మెచ్చితేను మేనరికములు చూపి
తతి నేకతములకు దగ్గరఁ దీసీనే
(॥మేలే॥)
తోడు గాచుకుండితేను తొడిఁబడఁ గాఁగిలించి
వేడుకఁ గూడెను శ్రీవేంకటేశుఁడు
పాడిపంతములతోడ పలుమారు నవ్వితేను
జాడల మమ్మిద్దరిని జంటలు సేసీనే
(||pallavi||)
mele jāṇadanālu mikkili lābagām̐ḍaunu
kīlu sĕppam̐boḍe nābai kelu sām̐sīne
(||mele||)
tagavulu sĕppam̐bode tamaloni māḍalagu
tagulanāḍĕ nannum̐ dagune tānu
mŏgamulu sūsi nenu mŏkkulu mŏkkam̐gam̐bode
sigurum̐jedulu vaṭṭi sĕnagulu niṁchīne
(||mele||)
idavulu seyam̐bode iddarunum̐ gūsuṁḍi
radulagum̐ bĕnam̐gīne rājasānanu
midimīri mĕchchidenu menarigamulu sūbi
tadi negadamulagu daggaram̐ dīsīne
(||mele||)
toḍu gāsuguṁḍidenu tŏḍim̐baḍam̐ gām̐giliṁchi
veḍugam̐ gūḍĕnu śhrīveṁkaḍeśhum̐ḍu
pāḍibaṁtamuladoḍa palumāru navvidenu
jāḍala mammiddarini jaṁṭalu sesīne