Melayyaa neebhaagyamu mechchidi nenu

మేలయ్యా నీభాగ్యము మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలయ్యా నీభాగ్యము మెచ్చితి నేను
లించి మిమ్ముఁ జూచి పొగడేరు సతులు

(॥మేల॥)
కొండలు(ల?) వంటి చన్నులు కొమ్ముఁ గలిగితేను
నిండుఁ గళలు దేరీ నీ నెమ్మోమునను
దండి వేఁక మాపెకును తగు సంతోసము నీకు
వొండొరుల కెటువలె నొనగూర్చె దైవము

(॥మేల॥)
తీపులతో నాకె మోవి తేనేలు గారఁగాను
వోపికెతో మిక్కిలి నోరూరీ నూకు
రూపమెల్లా నాపెకు రుచులెల్లా నీకును
యేపున నిద్దరిని యెట్టు గూర్చె దైవము

(॥మేల॥)
పెంపుడరఁటులవంటి పెందొడ లాపెకుఁగల్తే
ముంపునఁ బులక లెట్టు మొలచె నీమై
సంపద లాపెకు నాకు సమరతి నీకును
ఇంపుతో శ్రీవేంకటేశ యెట్టు గూర్చె దైవము

(||pallavi||)
melayyā nībhāgyamu mĕchchidi nenu
liṁchi mimmum̐ jūsi pŏgaḍeru sadulu

(||mela||)
kŏṁḍalu(la?) vaṁṭi sannulu kŏmmum̐ galigidenu
niṁḍum̐ gaḽalu derī nī nĕmmomunanu
daṁḍi vem̐ka mābĕgunu tagu saṁtosamu nīgu
vŏṁḍŏrula kĕḍuvalĕ nŏnagūrsĕ daivamu

(||mela||)
tībulado nāgĕ movi tenelu gāram̐gānu
vobigĕdo mikkili norūrī nūgu
rūbamĕllā nābĕgu rusulĕllā nīgunu
yebuna niddarini yĕṭṭu gūrsĕ daivamu

(||mela||)
pĕṁpuḍaram̐ṭulavaṁṭi pĕṁdŏḍa lābĕgum̐galde
muṁpunam̐ bulaga lĕṭṭu mŏlasĕ nīmai
saṁpada lābĕgu nāgu samaradi nīgunu
iṁpudo śhrīveṁkaḍeśha yĕṭṭu gūrsĕ daivamu