మీవలెనే వుండవద్దా మేటియైన జాణలెల్లా
(॥పల్లవి॥)
మీవలెనే వుండవద్దా మేటియైన జాణలెల్లా
భావించి తెలియలేక పదరఁగ నేలా
(॥మీవ॥)
మొక్కలము లేఁటికి మోహముగలవారికి
మిక్కిలి వివేకాన మించుటగాక
వెక్కసపుఁదమకాన వేఁడుకొనె నిన్నాతఁడు
తక్కక నీ వందుకుఁ దగ నియ్యకొంటివి
(॥మీవ॥)
కోపగించనేమిటికి కూటమిగలవారికి
వోపికతో నిన్నిటికి నోర్చుటగాక
చేపట్టి నిన్నాతఁడు చెనకి నవ్వులు నవ్వె
తీపులమోవి యొసఁగితివి నీ వతనికి
(॥మీవ॥)
వింతసేయనేమిటికి వేడుకగలవారికి
అంతరంగాన సంతసమందుటగాక
యింతలోనే శ్రీవేంకటేశుఁడు నిన్నేలినాఁడు
కాంతపు నీవాతనిఁ గాఁగిలించుకొంటివి
(||pallavi||)
mīvalĕne vuṁḍavaddā meḍiyaina jāṇalĕllā
bhāviṁchi tĕliyalega padaram̐ga nelā
(||mīva||)
mŏkkalamu lem̐ṭigi mohamugalavārigi
mikkili vivegāna miṁchuḍagāga
vĕkkasabum̐damagāna vem̐ḍugŏnĕ ninnādam̐ḍu
takkaga nī vaṁdugum̐ daga niyyagŏṁṭivi
(||mīva||)
kobagiṁchanemiḍigi kūḍamigalavārigi
vobigado ninniḍigi norsuḍagāga
sebaṭṭi ninnādam̐ḍu sĕnagi navvulu navvĕ
tībulamovi yŏsam̐gidivi nī vadanigi
(||mīva||)
viṁtaseyanemiḍigi veḍugagalavārigi
aṁtaraṁgāna saṁtasamaṁduḍagāga
yiṁtalone śhrīveṁkaḍeśhum̐ḍu ninnelinām̐ḍu
kāṁtabu nīvādanim̐ gām̐giliṁchugŏṁṭivi