(॥పల్లవి॥)
మీరేమి దూరకురే మెలుఁతలాల
ఆరసి నే నెఱుఁగుదు నతని గుట్టెల్లా
(॥మీరే॥)
సొలసి యెవ్వతెదిక్కు చూచినఁ దాఁ జూచెఁగాని
మెలుపున నాతఁడు నామీఁదికన్నే
అలరి యీమాటలు తానాడిన నాడెఁగాని
కలదెల్లా నామీఁది కలవరింపులే
(॥మీరే॥)
ననుపై యెవ్వతెతోఁ దా నవ్వితేనే నవ్వెఁగాని
చనవై నాతోనే పో సరసమెల్లా
చెనకి యెక్కడఁ బొందుసేసితేఁ జేసెఁ గాని
పెనఁగి నాపైనే పో ప్రియమెల్లను
(॥మీరే॥)
వరుసిచ్చి యెందుండివచ్చినఁ దా పచ్చెఁగాని
సరి నాకాఁగిటనే పో సమరతులు
ఇరవై శ్రీవేంకటేశుఁ డయినఁ దా నాయఁగాని
వురముపై నన్ను మోఁచె నున్నవంతా లేఁటికి
(||pallavi||)
mīremi dūragure mĕlum̐talāla
ārasi ne nĕṟum̐gudu nadani guṭṭĕllā
(||mīre||)
sŏlasi yĕvvadĕdikku sūsinam̐ dām̐ jūsĕm̐gāni
mĕlubuna nādam̐ḍu nāmīm̐diganne
alari yīmāḍalu tānāḍina nāḍĕm̐gāni
kaladĕllā nāmīm̐di kalavariṁpule
(||mīre||)
nanubai yĕvvadĕdom̐ dā navvidene navvĕm̐gāni
sanavai nādone po sarasamĕllā
sĕnagi yĕkkaḍam̐ bŏṁdusesidem̐ jesĕm̐ gāni
pĕnam̐gi nābaine po priyamĕllanu
(||mīre||)
varusichchi yĕṁduṁḍivachchinam̐ dā pachchĕm̐gāni
sari nāgām̐giḍane po samaradulu
iravai śhrīveṁkaḍeśhum̐ ḍayinam̐ dā nāyam̐gāni
vuramubai nannu mom̐sĕ nunnavaṁtā lem̐ṭigi