Meerela padarere melumtalaala

మీరేల పదరేరే మెలుఁతలాల
Language

(॥పల్లవి॥)
మీరేల పదరేరే మెలుఁతలాల
మేరతో తన్ను నే మెప్పించేఁగాని

(॥మీరే॥)
చెప్పనీరే తనమాట చెలులిందరిముందర
యిప్పుడే మారుత్తరము లిచ్చేఁగాని
కప్పురము చల్లనీరే కాఁతాళించి నామీఁద
చిప్పలఁ జేఁతకుచేత సేసేఁగాని

(॥మీరే॥)
నగనీరే కేరడాన నాతో సారెసారెకు
మగుడి యినుమడిగా మళ్లించేఁగాని
మొగము చూడనీరే మునుకొని యందుకేమి
యెగసక్కేలన్నియు నేరుపరచేఁగాని

(॥మీరే॥)
పెనఁగనీరే తాను ప్రియమునఁ గాఁగిలించి
వొనరఁగ గుబ్బల నేనొత్తేఁగాని
యేనసె శ్రీవేంకటేశుఁ డే వలమేల్‌మంగను
వినయాన మనవులు విన్నవించేఁగాని

(||pallavi||)
mīrela padarere mĕlum̐talāla
merado tannu ne mĕppiṁchem̐gāni

(||mīre||)
sĕppanīre tanamāḍa sĕluliṁdarimuṁdara
yippuḍe māruttaramu lichchem̐gāni
kappuramu sallanīre kām̐tāḽiṁchi nāmīm̐da
sippalam̐ jem̐taguseda sesem̐gāni

(||mīre||)
naganīre keraḍāna nādo sārĕsārĕgu
maguḍi yinumaḍigā maḽliṁchem̐gāni
mŏgamu sūḍanīre munugŏni yaṁdugemi
yĕgasakkelanniyu nerubarasem̐gāni

(||mīre||)
pĕnam̐ganīre tānu priyamunam̐ gām̐giliṁchi
vŏnaram̐ga gubbala nenŏttem̐gāni
yenasĕ śhrīveṁkaḍeśhum̐ ḍe valamel‌maṁganu
vinayāna manavulu vinnaviṁchem̐gāni