Meegu meere telusunu meemdadettu

మీకు మీరే తెలుసును మీఁదటెత్తు
Language

(॥పల్లవి॥)
మీకు మీరే తెలుసును మీఁదటెత్తు
పైకొని వూరివారికి పను లిందుఁ గలవా

(॥మీకు॥)
చెక్కులు నీవు నొక్కితే సెలువుల నవ్వె నాకె
యెక్కువతక్కువలు నే మెఱఁగము
తక్కక చెలుల మింతే తగవు లేమడిగేరు
యిక్కడ సాకిరు లెవ్వరెట్టు చెప్పే రిఁకను

(॥మీకు॥)
కన్నుల నీవు చూచితే కాఁతాళించి పల్కె నాకె
వున్నసుద్దులు దెలియ వూరకే మాకు
యెన్న నూడిగపువార మేఁటికి గురిసేసేరు
పన్ని ఇందు కెవ్వ రొడఁబరచవచ్చేరు

(॥మీకు॥)
కలయ నీవు వచ్చితే కాఁగిలించుకొనె నాకె
తలఁపు లేర్పరచ నెంతటివారము
కొలువువారము వేఁడుకొనకు శ్రీవేంకటేశ
చలపట్టెవ్వరు మిమ్ము సాదించఁగలరు

(||pallavi||)
mīgu mīre tĕlusunu mīm̐daḍĕttu
paigŏni vūrivārigi panu liṁdum̐ galavā

(||mīgu||)
sĕkkulu nīvu nŏkkide sĕluvula navvĕ nāgĕ
yĕkkuvadakkuvalu ne mĕṟam̐gamu
takkaga sĕlula miṁte tagavu lemaḍigeru
yikkaḍa sāgiru lĕvvarĕṭṭu sĕppe rim̐kanu

(||mīgu||)
kannula nīvu sūside kām̐tāḽiṁchi palgĕ nāgĕ
vunnasuddulu dĕliya vūrage māgu
yĕnna nūḍigabuvāra mem̐ṭigi guriseseru
panni iṁdu kĕvva rŏḍam̐barasavachcheru

(||mīgu||)
kalaya nīvu vachchide kām̐giliṁchugŏnĕ nāgĕ
talam̐pu lerbarasa nĕṁtaḍivāramu
kŏluvuvāramu vem̐ḍugŏnagu śhrīveṁkaḍeśha
salabaṭṭĕvvaru mimmu sādiṁcham̐galaru