మీకు మీకు నమరును మిక్కిలివేడుకలెల్లా
(॥పల్లవి॥)
మీకు మీకు నమరును మిక్కిలివేడుకలెల్లా
కైకొని నేమెల్లాఁ జూడఁగంటిమిగదే
(॥మీకు॥)
సింగారరాయఁడుగదే చిత్తజిగురుఁడుగదే
అంగవించి నిన్నుఁ బెండ్లాడినవాండు
బంగారుపతిమవు పాలవెల్లికూఁతురవు
అంగన నీవు దేవులవైతివిగదే
(॥మీకు॥)
కాంచనపుదట్టివాఁడు కౌస్తుభపుమణివాఁడు
మంచితనమున నీకు మగఁడుగదే
మించుసిరులదానవు మేటితమ్మిపైదానవు
యెంచఁగ నితనిపుర మెక్కితివిగదవే
(॥మీకు॥)
చేతులు నాల్గిటివాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
ఆతుమగా నిన్ను నేలి అలరెఁగదే
యీతల శ్రీకాంతపు యిన్నిటా నేరుపరివి
యీతని కెప్పుడు నీవు యిరవైతివిగదే
(||pallavi||)
mīgu mīgu namarunu mikkiliveḍugalĕllā
kaigŏni nemĕllām̐ jūḍam̐gaṁṭimigade
(||mīgu||)
siṁgārarāyam̐ḍugade sittajigurum̐ḍugade
aṁgaviṁchi ninnum̐ bĕṁḍlāḍinavāṁḍu
baṁgārubadimavu pālavĕlligūm̐turavu
aṁgana nīvu devulavaidivigade
(||mīgu||)
kāṁchanabudaṭṭivām̐ḍu kaustubhabumaṇivām̐ḍu
maṁchidanamuna nīgu magam̐ḍugade
miṁchusiruladānavu meḍidammibaidānavu
yĕṁcham̐ga nidanibura mĕkkidivigadave
(||mīgu||)
sedulu nālgiḍivām̐ḍu śhrīveṁkaḍeśhvarum̐ḍu
ādumagā ninnu neli alarĕm̐gade
yīdala śhrīgāṁtabu yinniḍā nerubarivi
yīdani kĕppuḍu nīvu yiravaidivigade