మీకిద్దరికే తెలుసు మీరివచ్చే పనులు
(॥పల్లవి॥)
మీకిద్దరికే తెలుసు మీరివచ్చే పనులు
సాకిరి నితరులకు చక్కఁబెట్టరాదు
(॥మీకి॥)
చలపాదివాని నంత దండపెట్టఁబనిలేదు
చెలరేఁగి ఇచ్చకమే సేయవలెను
నెలకొన్న రమణిని నీవు నట్లానైతేనె
పొలఁతుల కింక మరి బుద్దిచెప్పరాదు
(॥మీకి॥)
మంకువోజవానితోడ వచ్చరించఁబనిలేదు
అంకెకు వచ్చినట్టెల్లా నాడవలెను
సంకెలేక నీవూ నాజాడలనే మెలఁగితే
పొంకపుఁజుట్టాలకు బుద్దిచెప్పరాదు
(॥మీకి॥)
దొరపాటివానితోడ దూరఁగఁబనిలేదు
యిరవై శ్రీవేంకటేశుఁ డేలె నిన్నును
సరిగా నీవూ నట్టే సమరతి నొత్తితేను
పొరుగిరుగువారికి బుద్దిచెప్పరాదు
(||pallavi||)
mīgiddarige tĕlusu mīrivachche panulu
sāgiri nidarulagu sakkam̐bĕṭṭarādu
(||mīgi||)
salabādivāni naṁta daṁḍabĕṭṭam̐baniledu
sĕlarem̐gi ichchagame seyavalĕnu
nĕlagŏnna ramaṇini nīvu naṭlānaidenĕ
pŏlam̐tula kiṁka mari buddisĕpparādu
(||mīgi||)
maṁkuvojavānidoḍa vachchariṁcham̐baniledu
aṁkĕgu vachchinaṭṭĕllā nāḍavalĕnu
saṁkĕlega nīvū nājāḍalane mĕlam̐gide
pŏṁkabum̐juṭṭālagu buddisĕpparādu
(||mīgi||)
dŏrabāḍivānidoḍa dūram̐gam̐baniledu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnunu
sarigā nīvū naṭṭe samaradi nŏttidenu
pŏrugiruguvārigi buddisĕpparādu