Mee kiddarigim dagavu memu seppevaaramaa

మీ కిద్దరికిఁ దగవు మేము చెప్పేవారమా
Language

(॥పల్లవి॥)
మీ కిద్దరికిఁ దగవు మేము చెప్పేవారమా
చేకొన్న మీ వూడిగము చెలులము నేము

(॥మీకి॥)
యింతులు పైకొంటేను యియ్యకొనవలెఁగాని
యెంతైనాఁ బెనఁగరాదు యెప్పుడూ నీకు
పంతము లాడుకొంటేను పై పై నవ్వవలెఁగాని
వంతులకు మారుకొనవచ్చునా నీకు

(॥మీకి॥)
చనవున్నఁ గొసరితే సమ్మతించవలెఁగాని
వెనక ముం దెంచరాదు వింతగా నీకు
చెనకి కాఁగిలించితే చెలరేఁగవలెగాని
మనసు సోదించరాదు మలసి నీకు

(॥మీకి॥)
మొక్కితేను పొందుసేసి మొగమోడవలెగాని
వెక్కసించరాదు మరి వేరే నీకు
ఇక్కడ శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
చొక్కి వినోదించవలె సొంపుతో నీకు

(||pallavi||)
mī kiddarigim̐ dagavu memu sĕppevāramā
segŏnna mī vūḍigamu sĕlulamu nemu

(||mīgi||)
yiṁtulu paigŏṁṭenu yiyyagŏnavalĕm̐gāni
yĕṁtainām̐ bĕnam̐garādu yĕppuḍū nīgu
paṁtamu lāḍugŏṁṭenu pai pai navvavalĕm̐gāni
vaṁtulagu mārugŏnavachchunā nīgu

(||mīgi||)
sanavunnam̐ gŏsaride sammadiṁchavalĕm̐gāni
vĕnaga muṁ dĕṁcharādu viṁtagā nīgu
sĕnagi kām̐giliṁchide sĕlarem̐gavalĕgāni
manasu sodiṁcharādu malasi nīgu

(||mīgi||)
mŏkkidenu pŏṁdusesi mŏgamoḍavalĕgāni
vĕkkasiṁcharādu mari vere nīgu
ikkaḍa śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
sŏkki vinodiṁchavalĕ sŏṁpudo nīgu