Mechchidi mappude neegu mikkili mohimchidimi

మెచ్చితి మప్పుడే నీకు మిక్కిలి మోహించితిమి
Language

(॥పల్లవి॥)
మెచ్చితి మప్పుడే నీకు మిక్కిలి మోహించితిమి
హెచ్చె నీ సింగారాలు యెక్కడ చూచినను

(॥మెచ్చి॥)
అరిదిచెక్కులమీఁది యంగనకస్తూరివూఁత
కరఁగి నీచెంపలపై కారివుండఁగా
దొరతనాలు సేసేవు తొయ్యలులలోననెల్లా
యిరవాయ నీయెమ్మె యేమిచెప్పేది

(॥మెచ్చి॥)
కోమలిగుబ్బలమీఁదికుంకుమగందపుఁబూఁత
ఆముకొని నీవురాన నంటివుండఁగా
సాముసేసేవానివలె సతులకుఁజూపేవు
నే మెఱఁగమా నీవు నెరజాణవౌట

(॥మెచ్చి॥)
పొలఁతిమైనలఁదినపొడికప్పురపుపూఁత
నెలకొని రతివేల నీపై నంటఁగా
కొలువులో మాకుఁ జూపి కూడితివి మమ్మిందరి
తలఁచమా శ్రీవేంకటోత్తమనీమహిమలు

(||pallavi||)
mĕchchidi mappuḍe nīgu mikkili mohiṁchidimi
hĕchchĕ nī siṁgārālu yĕkkaḍa sūsinanu

(||mĕchchi||)
aridisĕkkulamīm̐di yaṁganagastūrivūm̐ta
karam̐gi nīsĕṁpalabai kārivuṁḍam̐gā
dŏradanālu sesevu tŏyyalulalonanĕllā
yiravāya nīyĕmmĕ yemisĕppedi

(||mĕchchi||)
komaligubbalamīm̐diguṁkumagaṁdabum̐būm̐ta
āmugŏni nīvurāna naṁṭivuṁḍam̐gā
sāmusesevānivalĕ sadulagum̐jūbevu
ne mĕṟam̐gamā nīvu nĕrajāṇavauḍa

(||mĕchchi||)
pŏlam̐timainalam̐dinabŏḍigappurabubūm̐ta
nĕlagŏni radivela nībai naṁṭam̐gā
kŏluvulo māgum̐ jūbi kūḍidivi mammiṁdari
talam̐samā śhrīveṁkaḍottamanīmahimalu