Me meṟamgamaa tannu mechchula golledalamu

మే మెఱఁగమా తన్ను మెచ్చుల గొల్లెతలము
Language

(॥పల్లవి॥)
మే మెఱఁగమా తన్ను మెచ్చుల గొల్లెతలము
గోములు మరిగి రాసకొడుకాయ నిపుడు

(॥మేమె॥)
పులుగు వంటి గుఱ్ఱము పొలము వంటిది యాలు
చిలువ వంటి పరపు సేరె(రెఁ) దనకు
తొలుత మాగొల్లవాఁడే దొరతన మబ్బెనంటా
కొలము దాసుక రాసకొడుకాయ నిపుడు

(॥మేమె॥)
కొక్కరవంటి సంకము కుదురు వంటి కైదువ
అక్కుమీఁది కొక పూస అబ్బెఁ దనకు
యెక్కువ నావులఁ గాచె నిన్నాళ్లు మావొద్ద
గుక్కక మిక్కక రాసకొడుకాయ నిపుడు

(॥మేమె॥)
పసపు వంటిది సీర పసిఁడిపతిమ సొమ్ము
యెసఁగ శ్రీ వేంకటాద్రి యెక్కుకొన్నాఁడు
వసముగాని సతుల(లు) వారిఁగూడి మమ్ముఁ గూడి
కొసరించుకొని రాసకొడుకాయ నిపుడు

(||pallavi||)
me mĕṟam̐gamā tannu mĕchchula gŏllĕdalamu
gomulu marigi rāsagŏḍugāya nibuḍu

(||memĕ||)
pulugu vaṁṭi guṭramu pŏlamu vaṁṭidi yālu
siluva vaṁṭi parabu serĕ(rĕm̐) danagu
tŏluda māgŏllavām̐ḍe dŏradana mabbĕnaṁṭā
kŏlamu dāsuga rāsagŏḍugāya nibuḍu

(||memĕ||)
kŏkkaravaṁṭi saṁkamu kuduru vaṁṭi kaiduva
akkumīm̐di kŏga pūsa abbĕm̐ danagu
yĕkkuva nāvulam̐ gāsĕ ninnāḽlu māvŏdda
gukkaga mikkaga rāsagŏḍugāya nibuḍu

(||memĕ||)
pasabu vaṁṭidi sīra pasim̐ḍibadima sŏmmu
yĕsam̐ga śhrī veṁkaḍādri yĕkkugŏnnām̐ḍu
vasamugāni sadula(lu) vārim̐gūḍi mammum̐ gūḍi
kŏsariṁchugŏni rāsagŏḍugāya nibuḍu