Mattudone solayave maganidonu

మట్టుతోనే సొలయవే మగనితోను
Language

(॥పల్లవి॥)
మట్టుతోనే సొలయవే మగనితోను
దిట్టవై పదరితేను దిద్దుకొనరాదు

(॥మట్టు॥)
మాఁటలాడవచ్చుఁగాని మర్మములు నాఁటితేను
గీఁటించి మీఁదటఁ బెల్లగించంగరాదు
కాటుకకన్నుల సన్న గావించవచ్చుఁగాని
పోటీవెట్టి యడిగితే పోల బొంకరాదు

(॥మట్టు॥)
నవ్వు నవ్వవచ్చుఁగాని నడుమ నెగ్గువట్టితే
వువ్విళ్ళూర మందువోసి వుడుపరాదు
పవ్వళించి వుండఁగాను పాదా లొత్తవచ్చుఁగాని
చివ్వనఁ గాఁగిలించితే సిగ్గువడరాదు

(॥మట్టు॥)
మొక్కు మొక్క వచ్చుఁగానిమోములఁటుకొంటేను
కక్కసించి నీరువోసి కడుగరాదు
అక్కున శ్రీవేంకటేశు కలమేల్మంగవు నీవు
ఇక్కడ నన్నేలినాఁడు యెలయించరాదు

(||pallavi||)
maṭṭudone sŏlayave maganidonu
diṭṭavai padaridenu diddugŏnarādu

(||maṭṭu||)
mām̐ṭalāḍavachchum̐gāni marmamulu nām̐ṭidenu
gīm̐ṭiṁchi mīm̐daḍam̐ bĕllagiṁchaṁgarādu
kāḍugagannula sanna gāviṁchavachchum̐gāni
poḍīvĕṭṭi yaḍigide pola bŏṁkarādu

(||maṭṭu||)
navvu navvavachchum̐gāni naḍuma nĕgguvaṭṭide
vuvviḽḽūra maṁduvosi vuḍubarādu
pavvaḽiṁchi vuṁḍam̐gānu pādā lŏttavachchum̐gāni
sivvanam̐ gām̐giliṁchide sigguvaḍarādu

(||maṭṭu||)
mŏkku mŏkka vachchum̐gānimomulam̐ṭugŏṁṭenu
kakkasiṁchi nīruvosi kaḍugarādu
akkuna śhrīveṁkaḍeśhu kalamelmaṁgavu nīvu
ikkaḍa nannelinām̐ḍu yĕlayiṁcharādu