మఱియేల చెప్పేవే మాతో నీవు
(॥పల్లవి॥)
మఱియేల చెప్పేవే మాతో నీవు
గుఱుతుగా సంతోసించుకొంటిమే నేము
(॥॥)
సంతతము రమణునిచనవు గలిగితేను
పంతమాడఁ జెల్లునే పడఁతీ నీకు
చెంతనుండి యాతఁడే నీచెప్పినట్టు సేసితేమ
వంతులకు గర్వింపవచ్చునే నీకు
(॥॥)
గారవించి పతి నీకుఁ గైవశమై వుండఁగాను
చేరి యంతనవ్వినాను చెల్లునే నీకు
మేరమీరి నిన్నే పొద్దూ మెడఁగట్టుకుండఁగాను
ఆరితేరి బిగిసినా నందమౌనే నీకు
(॥॥)
అలమేల్మంగవు నీవు ఆతఁడు శ్రీవేంకటేశుఁ
డలరి నిన్నేలెఁదగు నన్నియు నీకు
చెలులము నిన్నతఁడు చేకొని మన్నించఁగాను
మెలుపునఁ జూచితిమి మేలే నీకు
(||pallavi||)
maṟiyela sĕppeve mādo nīvu
guṟudugā saṁtosiṁchugŏṁṭime nemu
(||||)
saṁtadamu ramaṇunisanavu galigidenu
paṁtamāḍam̐ jĕllune paḍam̐tī nīgu
sĕṁtanuṁḍi yādam̐ḍe nīsĕppinaṭṭu sesidema
vaṁtulagu garviṁpavachchune nīgu
(||||)
gāraviṁchi padi nīgum̐ gaivaśhamai vuṁḍam̐gānu
seri yaṁtanavvinānu sĕllune nīgu
meramīri ninne pŏddū mĕḍam̐gaṭṭuguṁḍam̐gānu
ārideri bigisinā naṁdamaune nīgu
(||||)
alamelmaṁgavu nīvu ādam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍalari ninnelĕm̐dagu nanniyu nīgu
sĕlulamu ninnadam̐ḍu segŏni manniṁcham̐gānu
mĕlubunam̐ jūsidimi mele nīgu