మరిగితి మిదె నిన్ను మా భాగ్యము
(॥పల్లవి॥)
మరిగితి మిదె నిన్ను మా భాగ్యము
తరితీపులఁ బెట్టేరు దండనున్న చెలులు
(॥మరి॥)
గుఱ(ఱు)తులు నీ మేనివి గొబ్బున వెల్లావిరులు
మఱఁగులు మొఱఁగులు మా మాటలు
మఱి దొరవు గనక మానుపరావు పనులు
వొఱపుల నొరసేరు వొద్దనున్న చెలులు
(॥మరి॥)
తలఁపులు నీలోనివి దట్టపురాలవంటి
మలకలు మొలకలు మా వయసులు
బలిమికాఁడవు గాన పట్టరు నీగుణములు
సొలసేరు మమ్ము నైతే చుట్టాలైన చెలులు
(॥మరి॥)
గుదిగొన్న ప్రియములు కూడిన నీ కూటములు
మదములు ముదములు మా సిగ్గులు
అదె శ్రీ వేంకటేశుఁడ అలమేలుమంగ నేను
పదరరు మీతో మమ్ముఁ బాడేరు మా చెలులు
(||pallavi||)
marigidi midĕ ninnu mā bhāgyamu
taridībulam̐ bĕṭṭeru daṁḍanunna sĕlulu
(||mari||)
guṟa(ṟu)tulu nī menivi gŏbbuna vĕllāvirulu
maṟam̐gulu mŏṟam̐gulu mā māḍalu
maṟi dŏravu ganaga mānubarāvu panulu
vŏṟabula nŏraseru vŏddanunna sĕlulu
(||mari||)
talam̐pulu nīlonivi daṭṭaburālavaṁṭi
malagalu mŏlagalu mā vayasulu
balimigām̐ḍavu gāna paṭṭaru nīguṇamulu
sŏlaseru mammu naide suṭṭālaina sĕlulu
(||mari||)
gudigŏnna priyamulu kūḍina nī kūḍamulu
madamulu mudamulu mā siggulu
adĕ śhrī veṁkaḍeśhum̐ḍa alamelumaṁga nenu
padararu mīdo mammum̐ bāḍeru mā sĕlulu