మరిగేల కొసరేవు మగువను సారెసారె
(॥పల్లవి॥)
మరిగేల కొసరేవు మగువను సారెసారె
తరితీపులకునెల్ల తమకించెఁ జాలదా
(॥మరి॥)
యెక్కువతక్కువలుగా నెదురు మాటాడక
అక్కరతో సేవసేసె నది చాలదా
కక్కసించి మారుకొని కాఁతాళము రేఁచక
మక్కువ నీనవ్వులకు మారునవ్వెఁ జాలదా
(॥మరి॥)
చప్పనవుప్పననుచు జగడాలుదియ్యక
అప్పుడే విడెమిచ్చె నది చాలదా
తప్పులు నిన్నుఁబట్టి తరితీపులు చూపక
ముప్పిరిఁ జేతులెత్తి మొక్కె నీకుఁ జాలదా
(॥మరి॥)
సిగ్గులునెగ్గు లెంచక శ్రీవేంకటేశ్వర యింతి
అగ్గమై నిన్నుఁ గూడె నది చాలదా
వెగ్గళించ కింపులుగా వేవేలురతులను
వొగ్గి నీకు నొడిగట్టి వొక్కటాయఁ జాలదా
(||pallavi||)
marigela kŏsarevu maguvanu sārĕsārĕ
taridībulagunĕlla tamagiṁchĕm̐ jāladā
(||mari||)
yĕkkuvadakkuvalugā nĕduru māḍāḍaga
akkarado sevasesĕ nadi sāladā
kakkasiṁchi mārugŏni kām̐tāḽamu rem̐saga
makkuva nīnavvulagu mārunavvĕm̐ jāladā
(||mari||)
sappanavuppananusu jagaḍāludiyyaga
appuḍe viḍĕmichchĕ nadi sāladā
tappulu ninnum̐baṭṭi taridībulu sūbaga
muppirim̐ jedulĕtti mŏkkĕ nīgum̐ jāladā
(||mari||)
siggulunĕggu lĕṁchaga śhrīveṁkaḍeśhvara yiṁti
aggamai ninnum̐ gūḍĕ nadi sāladā
vĕggaḽiṁcha kiṁpulugā veveluradulanu
vŏggi nīgu nŏḍigaṭṭi vŏkkaḍāyam̐ jāladā