మఱి యేఁటిమాటలు మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మఱి యేఁటిమాటలు మాపు దాఁకాను
యెఱఁగవా నీవేమైనా నిఁక నీచిత్తమయా
(॥మఱి॥)
చెప్పరాని ప్రియము చెప్పితి ననియఁ(యేఁ?) జెలి
అప్పటిని వేఁడుకొంటిననియఁ జెలి
తప్పక నీవన్నమాఁట తలఁచుకొమ్మనెఁ జెలి
యెప్పడు గరుణించేవో యిఁక నీచిత్తమయా
(॥మఱి॥)
ఇదె నీకు వయసు మీదెత్తితిననియఁ జెలి
అదనాయ నిన్నిట్టె రమ్మనియఁ జెలి
మదిలోనఁ దనబత్తి మరవకుమనెఁ జెలి
యెదురెదురే చూచీ నిఁక నీచిత్తమయా
(॥మఱి॥)
మచ్చిక దయిలువార మన్నించుమనియఁ జెలి
అచ్చమైన నీదేవుల ననియఁ జెలి
యిచ్చల శ్రీవేంకటేశ యింతలో వచ్చి కూడితి -
వెచ్చరించితి విందాఁకా నిఁక నీచిత్తమయా
(||pallavi||)
maṟi yem̐ṭimāḍalu mābu dām̐kānu
yĕṟam̐gavā nīvemainā nim̐ka nīsittamayā
(||maṟi||)
sĕpparāni priyamu sĕppidi naniyam̐(yem̐?) jĕli
appaḍini vem̐ḍugŏṁṭinaniyam̐ jĕli
tappaga nīvannamām̐ṭa talam̐sugŏmmanĕm̐ jĕli
yĕppaḍu garuṇiṁchevo yim̐ka nīsittamayā
(||maṟi||)
idĕ nīgu vayasu mīdĕttidinaniyam̐ jĕli
adanāya ninniṭṭĕ rammaniyam̐ jĕli
madilonam̐ danabatti maravagumanĕm̐ jĕli
yĕdurĕdure sūsī nim̐ka nīsittamayā
(||maṟi||)
machchiga dayiluvāra manniṁchumaniyam̐ jĕli
achchamaina nīdevula naniyam̐ jĕli
yichchala śhrīveṁkaḍeśha yiṁtalo vachchi kūḍidi -
vĕchchariṁchidi viṁdām̐kā nim̐ka nīsittamayā