Maṟi yemti vinnabaalu maabu daamkaanu

మఱి యేఁటి విన్నపాలు మాపు దాఁకాను
Language

(॥పల్లవి॥)
మఱి యేఁటి విన్నపాలు మాపు దాఁకాను
నెఱతనాన మొక్కఁగా నీ చిత్తమిఁకను

(॥ఏమీ॥)
వేమారు నే వేడుకోగా వెరపు దెలిసె నీకు
గామిడి వైతివి నిన్ను గరగించేనా
దోమటి సతులతో నే దోసిటిపాలపెండ్లి
నీమీఁదఁ జన్నగా నీ చిత్తమికను

(॥ఏమీ॥)
సరసములాడుఁ(డఁ)గాను చలివాసె నీ కిన్నిటా
గొరబైతి వెందుకైనాఁ గొంక జూచేవా
దొర సతుల లోన తోడుగూడఁ జెనకగా
నిరతి మేటి విన్నిటా నీ చిత్తమిఁకను

(॥ఏమీ॥)
గక్కన నిన్నుఁ గూడగా కందువలెల్లాఁ దెలిసె
యెక్కువైతి విన్నిటా నీ వ్రవయ్యేవా
మక్కువ శ్రీ వేంకటేశ మన్నన దేవుళ్ళలో
నిక్కపుమేలు గంటి నీ చిల్లమిఁకను

(||pallavi||)
maṟi yem̐ṭi vinnabālu mābu dām̐kānu
nĕṟadanāna mŏkkam̐gā nī sittamim̐kanu

(||emī||)
vemāru ne veḍugogā vĕrabu dĕlisĕ nīgu
gāmiḍi vaidivi ninnu garagiṁchenā
domaḍi sadulado ne dosiḍibālabĕṁḍli
nīmīm̐dam̐ jannagā nī sittamiganu

(||emī||)
sarasamulāḍum̐(ḍam̐)gānu salivāsĕ nī kinniḍā
gŏrabaidi vĕṁdugainām̐ gŏṁka jūsevā
dŏra sadula lona toḍugūḍam̐ jĕnagagā
niradi meḍi vinniḍā nī sittamim̐kanu

(||emī||)
gakkana ninnum̐ gūḍagā kaṁduvalĕllām̐ dĕlisĕ
yĕkkuvaidi vinniḍā nī vravayyevā
makkuva śhrī veṁkaḍeśha mannana devuḽḽalo
nikkabumelu gaṁṭi nī sillamim̐kanu