Maṟi nenu vedugado maamtalellaa naademgaani

మఱి నేను వేడుకతో మాఁటలెల్లా నాడేఁగాని
Language

(॥పల్లవి॥)
మఱి నేను వేడుకతో మాఁటలెల్లా నాడేఁగాని
యెఱుకగా నీ విప్పుడే యెఱిఁగించి రావే

(॥మఱి॥)
బత్తి నాపైఁ గలఁదో పరాకై తా నున్నాఁడో
చిత్తము దెలిసిరావే చెలియా
హత్తిన చుట్టరికము లన్నియును విన్నవించి
కొత్తఁగా వలపు తలకొనఁజేసి రావే

(॥మఱి॥)
యెడయ కిందు వచ్చీనో యేమని యానతిచ్చీనో
అడియాల మిటు దేవే అతివ
వొడఁబాటులన్నియును వొద్దికతో నెచ్చరించి
వుడివోని తరితీపు లొనగూర్చి రావే

(॥మఱి॥)
చేరి వాకిట నున్నాఁడో సింగారించుకొనీనో
నేరుపుతో దోడితేవే నెలఁత
యీరీతి శ్రీవేంకటేశుఁ డిదిగో నన్ను నేలె
గారవాన నిన్నీ దారుకాణింతు రావే

(||pallavi||)
maṟi nenu veḍugado mām̐ṭalĕllā nāḍem̐gāni
yĕṟugagā nī vippuḍe yĕṟim̐giṁchi rāve

(||maṟi||)
batti nābaim̐ galam̐do parāgai tā nunnām̐ḍo
sittamu dĕlisirāve sĕliyā
hattina suṭṭarigamu lanniyunu vinnaviṁchi
kŏttam̐gā valabu talagŏnam̐jesi rāve

(||maṟi||)
yĕḍaya kiṁdu vachchīno yemani yānadichchīno
aḍiyāla miḍu deve adiva
vŏḍam̐bāḍulanniyunu vŏddigado nĕchchariṁchi
vuḍivoni taridību lŏnagūrsi rāve

(||maṟi||)
seri vāgiḍa nunnām̐ḍo siṁgāriṁchugŏnīno
nerubudo doḍideve nĕlam̐ta
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍidigo nannu nelĕ
gāravāna ninnī dārugāṇiṁtu rāve