(॥పల్లవి॥)
మఱి మీకు వేళలేదా మగువలాల
మెఱశాతఁడే మన్నించీ మిమ్మూ సవతులాల
(॥మఱి॥)
ఆలుమగఁడు నున్నారు అదివో యేకతమున
యేల తొంగిచూచేరే యింతులాల
మేలువారై తమలోన మేలములాడుకొనేరు
ఆలకించే రదియేమే అతివలాల
(॥మఱి॥)
వెలఁది పాటవాడఁగా వింటానున్నాఁ డాతఁడు
గలభిసేయకురే కాంతలాల
నలిరేఁగి యిద్దరూను నవ్వుకొంటా నున్నవారు
తలుపేల తెరచేరే తరుణులాల
(॥మఱి॥)
సరిఁ దాము చిలుకకు చదువులు నేరిపేరు
పరాకుసేయకురే పడఁతులాల
అరుదై శ్రీవేంకటేశఁ డలమేల్ మంగ నున్నారు
సిరులఁ గాచుకుండరే చెలువలాల
(||pallavi||)
maṟi mīgu veḽaledā maguvalāla
mĕṟaśhādam̐ḍe manniṁchī mimmū savadulāla
(||maṟi||)
ālumagam̐ḍu nunnāru adivo yegadamuna
yela tŏṁgisūsere yiṁtulāla
meluvārai tamalona melamulāḍugŏneru
ālagiṁche radiyeme adivalāla
(||maṟi||)
vĕlam̐di pāḍavāḍam̐gā viṁṭānunnām̐ ḍādam̐ḍu
galabhiseyagure kāṁtalāla
nalirem̐gi yiddarūnu navvugŏṁṭā nunnavāru
talubela tĕrasere taruṇulāla
(||maṟi||)
sarim̐ dāmu silugagu saduvulu neriberu
parāguseyagure paḍam̐tulāla
arudai śhrīveṁkaḍeśham̐ ḍalamel maṁga nunnāru
sirulam̐ gāsuguṁḍare sĕluvalāla